ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని ట్రాఫిక్ ఏసీపీ బాలరాజు సూచించారు. 32వ జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల సందర్భంగా రామగుండం ట్రాఫిక్ సీఐ జి.రమేష్ బాబు ఆధ్వర్యంలో మహిళల హెల్మెట్ ర్యాలీ జరిగింది. ద్విచక్ర వాహనాల్లో ప్రయాణించేటపుడు హెల్మట్ ప్రాధాన్యం తెలిపేందుకు ర్యాలీని ఏర్పాటు చేసినట్లు సీఐ తెలిపారు. బైక్ వెనుక కూర్చున్న వారు కూడా హెల్మెట్ ధరించాలని ఆయన సూచించారు. అన్ని రంగాలలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న మహిళలు రహదారి ప్రమాదాల నివారణ లో కూడా భాగస్వామ్యం కావాలlr ట్రాఫిక్ సీఐ రమేష్ బాబు కోరారు. రోడ్డు ప్రమాదాల్లో మృతిచెందుతున్నవారిలో హెల్మెట్ ధరించని కారణంగా చనిపోతున్నవారే ఎక్కువని ఆయన తెలిపారు. మహిళలు సురక్షితంగా ఉంటే కుటుంబ సభ్యులు ఆనందంగా ఉంటారని రమేష్ బాబు తెలిపారు.
ఇదీ చదవండి: గ్రామాల్లో మార్మోగుతున్న రామ నామం !గందరగోళంలో నాయక గణం
ఈ ర్యాలీ ని ఉద్దేశించి సీఐ గారు మాట్లాడుతూ శారీరకంగా కఠినమైన రాష్ట్ర,కేంద్ర పోలీస్ పోలీస్ బలగాలలో చేరి కఠినమైన శిక్షణ ను పూర్తి చేసుకొని పురుషులతో సమానంగా విధులు నిర్వహిస్తున్నారు. ప్రతి కుటుంబం లో గణనీయమైన పాత్ర పోషిస్తున్న మహిళలు వారు వాహనాలు నడుపుతున్న సమయంలో హెల్మెట్ ధరించడమే కాకుండా వారి కుటుంబ సభ్యులకు కూడా హెల్మెట్ యొక్క ప్రాముఖ్యత వివరించి బైక్ పై ప్రయాణించే సమయంలో భర్తకు, కుమారులకు, సోదరులకు కచ్చితంగా హెల్మెట్ ధరించేలా చూడాలని తెలిపారు. ప్రమాద రహిత సమాజ స్థాపనలో మహిళలు ముఖ్య పాత్ర పోషించాలని సూచించారు. ర్యాలీలో పలువురు మహిళా కానిస్టేబుల్స్, మున్సిపల్ సిబ్బంది తో పాటుగా కళాశాల విద్యార్థినులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: విరాళాలు వివాదాలు