బోయిన్ పల్లిలో ప్రవీణ్ రావు సోదరుల కిడ్నాప్ కేసులో భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి బెయిల్ పిటీషన్ ను సికింద్రాబాద్ కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో మరికొందరిని అరెస్టు చేయాల్సి ఉందని ఈ సమయంలో జగత్ విఖ్యాత్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉందని పోలీసులు కౌంటర్ పిటీషన్ దాఖలు చేశారు. ఈ కేసులు ఇరువురి వాదనలు విన్న కోర్టు జగత్ విఖ్యాతిరెడ్డికి ముందస్తు బెయిల్ పిటీషన్ ను కొట్టివేసింది. ఇప్పటికే అరెస్టయిన 15 మంది బెయిల్ పిటీషన్లపై విచారణను ఫిబ్రవరి 1కి కోర్టు వాయిదా వేసింది.
ఇది చదవండి: కేసీఆర్ పెద్దరికం చేయండి..మా అక్క ప్రాణాల్ని కాపాడండి
మియాపూర్ సమీపంలోని హఫీజ్ పేట్ లో దాదాపు రెండువేలకోట్ల విలువైన 48 ఎకరాల వివాదస్పద భూమి వ్యవహారంలో భూమా అఖిలప్రియ ప్రోత్సాహంతో కొందరు వ్యక్తులు ప్రవీణ్ రావు సోదరులను కిడ్నాప్ చేశారు. పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టడంతో అవుటర్ రింగు రోడ్డుపై వదిలి కిడ్నాపర్లు వెళ్లిపోయారు. ఈ కేసులో ఇప్పటికే బెయిల్ పొందిన అఖిలప్రియ ఏ1గా, సుబ్బారెడ్డి ఏ2గా, అఖిలప్రియ భర్త భార్గవ రామ్ ను ఏ3 ముద్దాయిలుగా ఉన్నారు.