Sunday, December 22, 2024

రాజకీయాల్లోకి మెగాస్టార్ రీ ఎంట్రీ…ఎప్పుడంటే ?

  • నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు
  • తమ్ముళ్లకు అండగా చిరు
  • రాజకీయాల్లో కాక రేపుతున్న నాదెండ్ల వ్యాఖ్యలు

సినీనటుడు మెగాస్టార్ చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి రానున్నారా. అన్నదమ్ములు ఆంధ్ర రాజకీయాలను శాసించనున్నారా అంటే  పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేనలో ఇప్పటికే సోదరుడు నాగబాబు ఉన్నారు. వీరికి తోడుగా మెగాస్టార్ రానున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం బట్టి తెలుస్తోంది. విజయవాడలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలు ఇపుడు సంచలనం రేపుతున్నాయి. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మళ్లీ సినిమాలు చేసేలా ఒప్పించింది. ఆయన సోదరుడు చిరంజీవేనని జనసేన కార్యకర్తల సమావేశంలో నాదెండ్ల మనోహర్ అన్నారు.  అంతేకాదు పవన్ రాజకీయ ప్రస్థానంలో తనుకూడా తోడుగా ఉంటానని అన్నారని నాదెండ్ల తెలిపారు.

ఇది చదవండి: తిరుపతిలో పోటీకి జనసేన సై?

అయితే నాదెండ్ల వ్యాఖ్యలతో జనసేన శ్రేణులు సంబురాల్లో మునిగిపోయాయి. చిరు రాజకీయాల్లోకి మళ్లీ రావడం  ఖాయమని అంటున్నారు. తిరుపతి ఉప ఎన్నిక బరిలో జనసేన నిలిస్తే పార్టీకి చిరంజీవి ఆశీస్సులు ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.  

2014 ఎన్నికల ముందే రాజకీయాలకు స్వస్తి చెప్పిన చిరంజీవి సినిమాలకే పరిమిత మయ్యారు. టాలీవుడ్ అభివృద్ధికి ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ లను కలిసి చర్చించారు.

అయితే పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఇతర పార్టీలలో ఉన్న మెగా అభిమానులను ఐక్యం చేసేందుకు నాదెండ్ల అలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇది తాజా రాజకీయాల్లో ఓ ఎత్తుగడగా కొట్టిపారేస్తున్నారు.

ఇది చదవండి: ఔను…మా మధ్య గ్యాప్ నిజమే!

Paladugu Ramu
Paladugu Ramu
సీనియర్ సబ్ ఎడిటర్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles