Thursday, December 26, 2024

ఊపిరి పీల్చుకున్న అమెరికా

అమెరికా అధ్యక్ష పదవిని వదిలిన ట్రంప్ సంస్కృతి పై ప్రతి దేశం భయాందోళనకు గురైంది. అమెరికన్లు సద్దాం హుసేన్, బిన్ లాడెన్ కంటే స్వదేశం లో ట్రంప్ తీసుకున్న చర్యలు, ట్రంప్ అనుసరించిన విదేశాంగ విధానం చూసి భయపడ్డారు. పిచ్చివాడి చేయికి అధికారం అనే రాయి ఇచ్చినట్టు అనిపించింది. దేశీయ విధానం పక్కన బెడితే ముస్లిం దేశాలతో, చైనా తో ట్రంప్ ద్వేష భావం పై పత్రికలు అనేక కథనాలు ప్రచురించాయి! వాటికి భిన్నంగా ఇతర దేశాలు ట్రంప్ పై వెళ్లగక్కిన ఈర్ష్య ద్వేషాలకు అంతర్జాతీయ మీడియా ప్రాధాన్యత ఇవ్వలేదు! అమెరికా అంతర్గత వ్యవహారాల్లో ఏ దేశం జోక్యం కూడా చేసుకోలేదు! బిన్ లాడెన్ ఉండి ఉంటే ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునే వారేమో గానీ, అదృష్ట వశాత్తు బయట ఉపద్రవం అమెరికాకు తప్పింది. అంతర్గత శత్రువుల నుండి ముఖ్యంగా ట్రంప్ మద్దతు దారులైన సెక్యూరిటీ సిబ్బందే విచ్ఛిన్నానికి పాల్పడతారని అమెరికన్లు భయపడ్డారు! ట్రంప్ విజయానికి ఆజ్యం పోసిన సాంస్కృతిక విజయం ఆయన వైట్ హౌస్ ను వీడినప్పుడు అధికార మార్పిడి సంస్కృతిని కూడా తుంగలో తొక్కారు.  అధికార దాహాన్ని ప్రపంచానికి వదిలి వెళ్లడం వల్ల ట్రంప్ లాంటి నాయకుడు దేశాన్ని ఏలితే ఏమి చేయాలో రాజ్యాంగంలో చేర్చే విధంగా ప్రస్తుత దేశ పాలకులు ఆలోచించే గొప్ప గుణ పాఠాన్ని ట్రంప్ వల్ల నేర్చుకున్నాయి.  33 ప్రపంచ దేశాల్లో కఠినమైన రాజ్యాంగ దిశ నిర్దేశాలు ఉన్నాయి. “ట్రంప్ సంస్కృతి” పై మేరీ ల్యాండ్ విశ్వవిద్యాలయంలో పరిశోధనలు పదేళ్లుగా జరుగుతున్నాయట. ప్రపంచ దేశాలకు హిత బోధ చేద్దామన్న ఆ పరిశోధనలు ఇప్పుడు ట్రంప్ సంస్కృతిగా మార్చుకుంటాయేమో. అమెరికాకే ఏకు మేకైతడని  అది ట్రంప్ సంస్కృతిగా మారుతుందని ఆ విశ్వవిద్యాలయం కూడా ఊహించి ఉండదు. అమెరికన్లు యుద్ధ భయంతో, ప్రకృతి విపత్తులతో, అంటూ వ్యాధులతో సతమవుతున్నారు.  రోగ నిరోధక శక్తి ని తట్టుకునే సామర్థ్యం అమెరికా ప్రజలకు తక్కువ. అందుకే కరోనా మరణాలు అమెరికాలో ఎక్కువయ్యాయి. దానికి అక్కడి వైద్య చట్టాల పేలవం కూడా ఒక కారణం. డాక్టర్లు కూడా కరోనా భయం తో భయబ్రాంతులకు గురికావడం అమెరికాకు శాపం. యుద్ధం, కరువు, ప్రకృతి వైపరీత్యాలతో ఉన్న ఆ సంబంధాన్ని అమెరికన్లు పరిగణనలోకి తీసుకోలేక పోతున్నారా?

ఇది చదవండి: అమెరికా రక్షణ వ్యవస్థ ఇంత బలహీనంగా ఉందా?

కంప్యూటర్ సిద్ధాంతాలు, అంతర్జాతీయ సర్వేల ప్రకారం అతి పెద్ద అమెరికాలో కరువు, ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధ భయాలతో వణికి పోతున్నారు. కొన్ని దేశాల మాదిరిగానే, కఠినమైన చట్టాలు మరియు బలమైన నియమాలతో ఉన్న అమెరికన్ రాష్ట్రాలు అధిక విపత్తు, వ్యాధి ఒత్తిడితో సతమతమవుతున్న విషయాలపై ప్రపంచ మీడియా అంతంగా దృష్టి సారించడం లేదు.  ఉదాహరణకు, మిస్సిస్సిప్పి మరియు అలబామా తుఫానులు, వరదలు కారణంగా దేశంలో అత్యధిక మరణాల రేటును కలిగి ఉన్నాయి, అలాగే కొన్ని అంటు వ్యాధులు అమెరికా రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్నాయి.  న్యూ హాంప్‌షైర్, వాషింగ్టన్ వంటి  రాష్ట్రాలు ప్రకృతి వైపరీత్యాలు, అంటు వ్యాధుల సంక్రమణ తక్కువగా ఉన్నా వీరు యుద్ధ భయం తో బెంబేలెత్తిపోతున్నారు. ఈ రాజకీయ పోకడలో శ్వేత జాతీయులు, నల్లజాతీయుల  మధ్య గొడవలు చెలరేగే అవకాశాలను మీడియా వెలుగులోకి రానివ్వడం లేదు. అమెరికా పటిష్టమైన ప్రజాస్వామ్యం దిశగా అడుగులు వేసే చర్యలు విశేష అనుభవం ఉన్న బైడెన్ తీసుకోవాలి. అదృష్టం ఏమిటంటే బైడెన్ ప్రమాణ స్వీకారానికి బుష్, ఒబామా లాంటి వారు వచ్చి పార్టీలకు, వ్యక్తులకు, అతీతంగా అమెరికన్లు ప్రయోజనాలు ట్రంప్  వెకిలి చేష్టలు ఖండించడం శుభ పరిణామం. తన ప్రచారంలో, డొనాల్డ్ ట్రంప్ భయపడే ఓటర్లను గుత్తాధిపత్యం చేయడానికి, ఇతర సాంస్కృతిక సమూహాలను రెచ్చగొట్టడం లో సఫలం అయ్యాడు.

ఇది చదవండి: అధికార బదిలీకి ముందు అమెరికా పరువు తీసిన ట్రంప్

 ట్రంప్ బెదిరింపు వాక్చాతుర్యం, ఉత్సాహపూరితమైన జాతీయవాదం మరియు తాను భిన్నంగా భావించే వారి పట్ల బాహ్య శత్రుత్వంతో భయాన్ని ప్రేరేపించడంలో సఫలం అయ్యారు. గతంలో అమెరికన్ ప్రెసిడెంట్ లు చేసిన నిర్వాకం గా ఆయన తన ప్రచారంలో చెప్పడం వల్ల ట్రంప్ వాదం అమెరికన్లలో బలపడింది.  ముప్పును ప్రేరేపించే ట్రంప్ సామర్థ్యం ఈ సమూహాలకు తన మద్దతుదారులను మార్చు కున్నాడు.

 ట్రంప్ యొక్క గతిశీలతను బాగా అర్థం చేసుకోవడానికి, అమెరికన్లు, ప్రాంతం, రాజకీయ అనుబంధం మరియు జాతి పరంగా ప్రతినిధులైన అమెరికన్లు కూడా ట్రంప్ పక్షాన నిలిచారు. బైడెన్ కొత్త నిర్ణయాలతో ప్రపంచ వ్యాప్తంగా పోయిన అమెరికా పరువు నిలబడుతుందో లేదో కాలమే నిర్ణయించాలి.

ఇది చదవండి: భద్రతా వలయంలో అమెరికా

Ramprasad Rao Bandaru
Ramprasad Rao Bandaru
Mr. Bandaru Rama Prasad has been a journalist since his 21st year. Starting with Andhra Bhoomi as a sub-editor he became desk in-charge at Andhra Prabha before becoming a freelancer and a script writer in electronic medium. Did his MA from Osmania University. He founded Amrita Tele Films..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles