- మంత్రాల మఱ్ఱి బ్రిస్బేన్ పిచ్
- రహానే సేనకు స్టీవ్ స్మిత్ వార్నింగ్
బ్రిస్బేన్ టెస్ట్ ఆఖరిరోజు ఆట ప్రారంభానికి ముందే…భారతజట్టును ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్, కంగారూ స్టార్ బ్యాట్స్ మన్ స్టీవ్ స్మిత్ భయపెడుతున్నాడు. గబ్బా పిచ్ లో దెయ్యాలు, భూతాలు ఉన్నాయని…చివరిరోజు ఆటలో అవి భయటకు వచ్చి తమ బౌలర్లరూపంలో భారత బ్యాట్స్ మన్ పని పట్టడం ఖాయమని జోస్యం చెప్పాడు.
నాలుగోరోజు ఆట ముగిసిన వెంటనే తమ రెండోఇన్నింగ్స్ లో టాప్ స్కోరర్ గా నిలిచిన స్మిత్ మీడియాతో తన అనుభవాలు పంచుకొన్నాడు. గబ్బా పిచ్ లో సహజసిద్ధమైన మార్పువచ్చిందనీ, గుడ్ లెన్త్ స్పాట్ లో పగుళ్లు వచ్చాయనీ…సరైనచోట్ల బంతులువిసరడమే తమ బౌలర్ల ముందున్న లక్ష్యమనీ స్మిత్ చెప్పాడు. బీటలువారిన ఆఖరిరోజు పిచ్ పైన బ్యాటింగ్ చేయడం అంత తేలికకాదని,,,పైగా 320 పరుగుల లక్ష్యం సాధించడం అంటే కత్తిమీద సామేనని అభిప్రాయపడ్డాడు. తమ ఫాస్ట్ బౌలర్లతో పాటు స్పిన్నర్ నేథన్ లయన్ తురుపుముక్క కానున్నాడని తెలిపాడు.
ఇది చదవండి: సిరాజ్ పేస్ కు కంగారూల క్లోజ్
బ్రిస్బేన్ వేదికగా జరిగే టెస్టుమ్యాచ్ ల్లో నాలుగో ఇన్నింగ్స్ బ్యాటింగ్ అంతతేలిక కాదని గత రికార్డులే చెబుతున్నాయనీ…పైగా వికెట్ బ్యాటింగ్ కంటే బౌలింగ్ కే అనువుగా ఉంటుందనీ గుర్తు చేశాడు. గబ్బా స్టేడియంలో జరిగే టెస్టులలో మొదటి మూడురోజుల బ్యాటింగ్ ఒక ఎత్తయితే…ఆఖరి రెండురోజుల బ్యాటింగ్ మరో ఎత్తని విశ్లేషించాడు.
1988 నుంచి బ్రిస్బేన్ గబ్బా వేదికగా జరిగిన టెస్టుమ్యాచ్ ల్లో ఓటమి అంటే ఏమిటో ఎరుగని ఆస్ట్రేలియా..ఆఖరిరోజు ఆటలో సత్తా చాటుకోడం ద్వారా సిరీస్ ను 2-1తో కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో ఉంది.
ఇది చదవండి: బ్రిస్బేన్ టెస్ట్ తొలిరోజున హోరాహోరీ
అయితే…అజింక్యా రహానే నాయకత్వంలోని భారతజట్టు మ్యాచ్ లో నెగ్గకున్నాచాలు…డ్రాగా ముగించగలిగితే అది సరికొత్త చరిత్రే అవుతుంది. ఐదుగురు ప్రధాన బౌలర్లు, పలువురు కీలక ఆటగాళ్లు లేకుండానే…అదీ అడిలైడ్ టెస్టు రెండో ఇన్నింగ్స్ లో 36 పరుగులకే కుప్పకూలినా..ఆ తర్వాత పుంజుకొని ఆడి మెల్బోర్న్ టెస్టులో నెగ్గి, సిడ్నీ టెస్టును డ్రాగా ముగించడం, బ్రిస్బేన్ టెస్ట్ మొదటి నాలుగురోజుల ఆటలో కంగారూలను ముప్పతిప్పలు పెట్టడం ఘనవిజయం లాంటిదే.