- భారత్ ఎదుట 320 పరుగుల లక్ష్యం
- క్లయ్ మాక్స్ లో బ్రిస్బేన్ టెస్ట్
భారత్- ఆస్ట్ర్రేలియాజట్ల ఆఖరిటెస్ట్ క్లయ్ మాక్స్ దశకు చేరింది. బ్రిస్బేన్ గబ్బా వేదికగా నువ్వా-నేనా అన్నట్లుగా సాగుతున్నఈ ఆఖరిపోరాటం ఆఖరిరోజు ఆటలో ఆతిథ్య ఆస్ట్రేలియా… భారత్ ఎదుట 320 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. 324 పరుగుల టార్గెట్ తో రెండోఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ వికెట్ నష్టపోకుండా 4 పరుగులు చేసిన సమయంలో వానతో అంతరాయం కలగడంతో ఆట ముగిసినట్లు అంపైర్లు ప్రకటించారు.
సిరాజ్ పాంచ్ పటాకా….
అంతకుముందు…ఓవర్ నైట్ స్కోరుతో …నాలుగో రోజఆట కొనసాగించిన ఆస్ట్రేలియాను వేగంగా పరుగులు చేయనివ్వకుండా భారత బౌలర్లు నిలువరించగలిగారు.
యువఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ నిప్పులు చెరిగే బౌలింగ్ తో చెలరేగిపోయాడు. వికెట్ వెంట వికెట్ తీస్తూ కంగారూలను నిలదొక్కుకోనివ్వకుండా చేశాడు. మరో పేసర్ శార్దూల్ ఠాకూర్ సైతం సిరాజ్ కు అండగా నిలవడంతో పాటు తనవంతుగా 4 వికెట్లు పడగొట్టాడు.
ఇది చదవండి: బ్రిస్బేన్ టెస్టులో భారత్ భళా
294 పరుగులకు ఆలౌట్…
తొలిఇన్నింగ్స్ లో సాధించిన 33 పరుగుల ఆధిక్యంతో రెండోఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియా 75.5 ఓవర్లలో 294 పరుగులకే కుప్పకూలింది. కంగారూ టాపార్డర్ లో స్టీవ్ స్మిత్ 55, ఓపెనర్ వార్నర్ 48, ఆల్ రౌండర్ గ్రీన్ 37, కమ్మిన్స్ 28 పరుగులు సాధించారు.భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్ 19.5 ఓవర్లలో 73 పరుగులిచ్చి 5 వికెట్లు, శార్దూల్ ఠాకూర్ 19 ఓవర్లలో 61 పరుగులిచ్చి 4 వికెట్లు, స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ 1 వికెట్ పడగొట్టారు.తన కెరియర్ లో కేవలం మూడోటెస్ట్ మాత్రమే ఆడుతున్న సిరాజ్ ఓ ఇన్నింగ్స్ల్ లో 5 వికెట్లు పడగొట్టడం ఇదే మొదటిసారి.
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ముగిసిన వెంటనే 324 పరుగుల లక్ష్యంతో చేజింగ్ కు దిగిన భారత్ కేవలం 11 బాల్స్ మాత్రమే ఎదుర్కొని 4 పరుగులు చేసిన సమయంలో వానతో మ్యాచ్ ను నిలిపివేశారు. దీంతో …నాలుగోరోజుఆటను ముగించినట్లు అంపైర్లు ప్రకటించారు. మ్యాచ్ ఆఖరి రోజున…నిర్ణితసమయం కంటే 30 నిముషాల ముందుగానే ఆట ప్రారంభించనున్నారు.
ఇది చదవండి: భారత 300వ టెస్ట్ క్రికెటర్ నటరాజన్