- పార్లమెంట్ పై దాడిని కూడా సమర్థ వంతంగా ఎదుర్కొన్న భారత్!
పేరుకే అమెరికా అగ్రరాజ్యమా? ఎంతో గొప్ప నిఘా వ్యవస్థగా పేరుగాంచిన అమెరికా కేవలం నాలుగు వేల మంది స్వదేశీ విద్రోహవాదులను క్యాపిటల్ హౌస్ కు రాకుండా అడ్డుకోలేక పోయిందా? గత అనుభవాల్లో కూడా అమెరికా నిఘా వ్యవస్థ నిద్ర పోవడం వల్ల అమెరికా రక్షణ స్థావరం పెంటగాన్ పై హైజాకర్లు విమానాన్ని కూల్చేశారు. ట్విన్ టవర్స్ కుప్పకూలిపోయాయి. అప్పటి అధ్యక్షుడు వైట్ హౌస్ బ్యాంకర్లో దాక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ట్రంప్ తుంటరి చర్యలు పసిగట్టలేక పోయిన నిఘా వ్యవస్థ వల్ల అభిశంసన తీర్మానాన్ని కూడా సెనేటర్లు భయభయంగా నిర్వహించారు. అమెరికా యాభై ప్రధాన నగరాల్లో శాంతి భద్రతలను సరిచేయడానికి అమెరికా రక్షణ వ్యవస్థ నానా తిప్పలు పడుతోంది. లాక్ డౌన్ సమయంలో నిర్బంధాన్ని వ్యతిరేకించి రోడ్ల మీదకు వచ్చిన ప్రజలను అమెరికా పోలీసులు అదుపు చేయడంలో విఫలం అయ్యారు. ఒక్కటేమిటీ అమెరికా లో గన్ కల్చర్ రాజ్యామేలుతున్నా కూడా పోలీసులు చేతులెత్తేస్తున్నారు.
ఇవాంక భత్రతపై కితాబు
అమెరికా అధ్యక్షుడు భారత్ పర్యటనకు వస్తే మన సెక్యూరిటీ చూసి అమెరికా అధికారులే మెచ్చుకున్నారు. మన పోలీసులు చేసిన ఏర్పాట్లకు ప్రసంశలు కూడా వచ్చాయి. హైద్రాబాద్ పోలీసులు కూడా అమెరికా అధ్యక్షుడి కూతురు ఇవాంక కు ఇచ్చిన రక్షణకు అమెరికా అత్యున్నత పోలీసులు ఏకంగా హైద్రాబాద్ పోలీసులకు లిఖితపూర్వకంగా ప్రశంసలు పంపారు. అమెరికా సెంట్రల్ ఇంటలిజెన్స్ ఏజన్సీ ( సి ఐ ఏ) నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ (ఎన్ ఎన్ ఏ) నిఘా వ్యవస్థలపై పెత్తనం చేయడానికి ప్రయత్నించిన ట్రంప్ వల్ల ఆ వ్యవస్థలు చీఫ్ డాన్ కోట్స్ పదవీకి రాజీనామా చేశారు. ఉత్తర కొరియా బెదిరింపులు, రష్యా అదిరింపులు ట్రంప్ కు చెప్పడం ఆయనకు రుచించలేదు. అసలు దేశ భద్రత పట్ల ట్రంప్ ఉదాసీన వైఖరి పట్ల రెండు నిఘా వ్యవస్థలు మొత్తుకున్నా ట్రంప్ పెడచెవిన పెట్టారు. మొత్తం అమెరికా 17 రక్షణ వ్యవస్థలను ట్రంప్ నిర్వీర్యం చేశారని కూడా అందువల్లే చిన్న దేశాలు కూడా అమెరికా పై కయ్యానికి కాలు దువ్వు తున్నాయని డెమోక్రాట్లు అంటున్నారు.
రక్షణవ్యవస్థ వైఫల్యం
ప్రపంచంలో చీమ చిటుక్కుమన్న గుర్తించే వీలు ఉందని చెప్పే అమెరికా నిఘా వ్యవస్థ, చంద్ర మండలం మీద అడుగు పెట్టిన ఘనత మాదే నని చెప్పుకుంటున్నా కూడా స్వదేశంలో జరుగుతున్న విధ్వంసకాండను గుర్తించడంలో అమెరికా రక్షణ వ్యవస్థ ఘోరంగా విఫలమైందని స్వదేశీయులే అంటున్నారు. ఆ లెక్కన రెండు యుద్ధాలనూ దీటుగా ఎదుర్కొన్న భారత్, కందహర్ విమాన హైజాక్ ను లౌక్యంగా పరిష్కరించడమే కాకుండా అప్పటి మన రక్షణ మంత్రి ఆప్ఘనిస్థాన్ గడ్డ మీద కందాహర్ కు వెళ్లి ప్రయాణికులను సురక్షితంగా తీసుకువచ్చారు. ఆ తరువాత కార్గిల్ ముష్కరులను పారద్రోలి, కశ్మీర్ తీవ్రవాదులను ఏరివేసి నిరంతరం శాంతి భద్రతలను కంటికి రెప్పలా కాపాడుతూనే ఉన్నారు. అటు చైనా, ఇటు పాక్ చేస్తున్న కవ్వింపు చర్యలను దీటుగా ఎదుర్కొంటూ, ప్రపంచంలో మన రక్షణ వ్యవస్థ ఏంతో మందితో ప్రశంసలు పొందుతోంది. మన పార్లమెంట్ పై 13 డిసెంబర్ 2011న ఇస్లామిక్ తీవ్రవాదులు దాడి చేసినప్పుడు పార్లమెంట్ భవనాల్లో మన ఎంపీలు చాలా మందే ఉన్నారు. అయినప్పటికి నలుగురు తీవ్రవాదులను హతమార్చి, మన భద్రతా సిబ్బంది తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయినా కూడా ప్రజా ప్రతినిధులను కాపాడారు. తమ కారుకు దొంగ గుర్తింపు కార్డులు ధరించి వచ్చి సెక్యూర్టీని ఛేదించినా కూడా అదే సెక్యూరిటీ తీవ్రవాదులను హతమార్చి తమ ఘనతను ప్రపంచానికి చాటింది. ఇలా ఎన్నో విద్రోహ చర్యలను ఎదుర్కొంటూ 138 కోట్ల మంది భారత పౌరులు ఇవ్వాళ్ళ హాయిగా నిద్ర పోతుంటే, 30 కోట్ల జనాభా ఉన్న అమెరికా పౌరులు అడుగడుగునా అభద్రత భావంతో సతమత మవుతున్నారు.
పెరుగుతున్న అభద్రతాభావం
సామాజిక భద్రత అమెరికాలో తీవ్రంగా లోపించింది. అడగడుగునా అభద్రతాభావం రాజ్యమేలుతుంది. నల్లజాతివారికీ, శ్వేతజాతివారికీ మధ్య వైరం ఈనాటిది కాదు. దానికి తోడు ఆసియా దేశాల వ్యాపారులూ, విద్యార్థులూ ప్రతి నాలుగేళ్ల కొకసారి ఉద్యోగ భద్రత పై భయసందేహాలతో సతమతం అవుతున్నారు. ఇవే గాక రాజకీయ వ్యవస్థలో కూడా విదేశీ విధానం మీద స్పష్టమైన వైఖరి లేదు. తనను ఎదిరించే వారిపై తుపాకీ ఎక్కుపెట్టి తనకు మద్దతు తెలపాలని ఒత్తిడి తేవడం వల్ల ఇస్లామిక్ దేశాలు కొన్ని ఏకమవుతున్నాయి. అమెరికా రాజకీయ స్థిరత్వం పై అమెరికా ప్రజాస్వామ్య వాదులు ఆందోళన చెందుతున్నారు.
చిన్న దేశాలు సైతం అమెరికాపై కాలుదువ్వుతున్నాయి
అతి చిన్న దేశమైన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ కూడా అమెరికా పై రంకెలు వేస్తుంటాడు. సద్దాం హుసేన్ ను, బిన్ లాడెన్ ను చంపామన్న ఘనత కన్నా వాళ్ళ శత్రువులే వాళ్ళ ఆచూకీ చెప్పారు తప్ప అమెరికా చేసింది ఏమీ లేదని విమర్శకులు అంటుంటారు. మనదేశ పోలీసు మిలటరీ వ్యవస్థ ముందు అమెరికా నిఘా వ్యవస్థ ఎందుకూ పనికి రాదనే విధంగా అక్కడి పరిణామాలు కనిపిస్తున్నాయి. కరోనా సమయంలో ఉత్తర కుమారుడి ప్రగల్భాలు పలికిన ట్రంప్ చైనా కు వ్యతిరేకంగా అన్ని దేశాలను కూడగట్టడం లో విఫలమయ్యారు. ఒక సింహం పది తోడేళ్ళు ఏకమైతే తోక ముడవడమో లేదా ప్రాణాలు పోవడమో జరిగినట్లు అమెరికా కూడా ఆసియా దేశాలు ఏకమైనా తోక ముడవడం ఖాయం.
Excellent analysis bro
చాలా గొప్పగా ఉంది
“అమెరికా కూడా ఆసియా దేశాలు ఏకమైనా తోక ముడవడం ఖాయం”.,
అమెరికా మన నేస్తం , మారుతున్న భౌగోళిక , సాంస్కృతిక , పొలిటికల్ కారణాలవల్ల ఇది జరుగుతుంది , నేను చైనాను ఎప్పుడు అనుమానం తోనే చూస్తాను , చైనాను నమ్మలేం , అది ఒక డేంజరస్ దేశం , అన్ని ఆసియా దేశాలు ( చైనా మినహా ) అమెరిక వైపు సాయం కొసం చుడుతున్నాయి , కరోనా కు కారణం ఐన చైనా తగిన మూల్యం చేల్లించాలి #makechinapay , ఇండియన్ ఓషన్ లో ‘ క్వాడ్ ‘ చైనా కు చెక్ పెట్టడానికే , దీనికి అమెరికా సాయం చాలా అవసరం.