- కాంగ్రెస్ వామపక్షాలకు పిలుపునిచ్చిన మమత
- వారసత్వ రాజకీయాలు అంతం కావాలన్ని మమత సోదరుడు
- బెంగాల్లో కీలక నేతలకు గాలం వేస్తున్న బీజేపీ
ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ పశ్చిమ బెంగాల్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికార తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. బెంగాల్ లో వారసత్వ రాజకీయాలకు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని మమతా బెనర్జీ సోదరుడు కార్తీక్ బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు ప్రజల స్థితిగతుల్లో మార్పులు తీసుకురావాలి. రాజకీయాల్లో సేవ చేసేవారు మొదట ప్రజా సంక్షేమం గురించి పాటుపడాలి. ఆ తర్వాతే కుటుంబం గురించి ఆలోచించాలి అని కార్తీక్ బెనర్జీ వ్యాఖ్యానించారు.
ఇది చదవండి: తృణమూల్ చేజారుతున్న మంత్రులు
కాంగ్రెస్, వామపక్షాల మద్దతు కోరిన మమత:
కార్తీక్ బెనర్జీ వ్యాఖ్యలతో తృణమూల్ కాంగ్రెస్ కలవరపాటుకు గురవుతోంది. కార్తీక్ బెనర్జీ బీజేపీతో చేరుతున్నారంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. ఆయనకు బీజేపీ భారీ ఆఫర్ ఇచ్చినట్లు సామాజిక మాధ్యమాలలో ప్రచారం జరుగుతోంది. మరోవైపు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మతతత్వ బీజేపీని అడ్డుకునేందుకు సహకరించాలని కాంగ్రెస్, వామపక్ష పార్టీలను మమత బెనర్జీ కోరారు. బెంగాల్ ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా గెలిచే సామర్థ్యం లేదని మమతా బెనర్జీ ఆరోపించారు. అందుకే ఇతర పార్టీ నేతలను చేర్చుకుని అధికారాన్ని చేపట్టేందుకు తహతహలాడుతోందని విమర్శించారు.
ఇది చదవండి: తృణమూల్ కాంగ్రెస్ లో భారీ కుదుపు
పట్టుకోసం ప్రయత్నిస్తున్న బీజేపీ :
పశ్చిమ బెంగాల్లో లోక్ సభ ఎన్నికల్లో అనూహ్య విజయాలను సొంతం చేసుకున్న బీజేపీ ఆ రాష్ట్రంలో పట్టుకోసం అనుక్షణం ప్రయత్నిస్తూనే ఉంది. కొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగున్న నేపథ్యంలో ఆ పార్టీ అగ్ర నేతలు రాష్ట్రంలో పర్యటిస్తూ శ్రేణుల్లో జోష్ ను నింపుతున్నారు. ఈ నెల 31, 31 తేదీలలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పశ్చిమ బెంగాల్లో పర్యటించనున్నారు.
ఇది చదవండి: బెంగాల్ పై పట్టు బిగిస్తున్న బీజేపీ