Friday, November 22, 2024

ఆత్మ శుద్ధి లేని పూజలు దండగ!

గాలిలొ దీపం పెట్టి దీపం అర్పనివ్వకు దేవుడా అని దండం పెడితే అది ఆరకుండా ఉంటుందా? మనిషి దేవుణ్ణి కొలవడం లో నానాయాతన పడుతున్నాడు. నిజానికీ కష్టం వచ్చినప్పుడే దేవుడు గుర్తుకు వస్తున్నాడు. సుఖాల్లో మాత్రం ఆయన అసలు కనబడడు. ఎందుకంటే దండం పెట్టవలసిన చేతులు ముడుచుకోవు అవి వేరే పనులు చేస్తున్నాయి. ఆ పనులను ఆపి దృష్టి మరల్చినప్పుడు దేవుడు గుర్తుకు వస్తున్నాడు. పాపభీతి తో చేతులు ముడుచుకుంటున్నాయి తప్ప ప్రాయశ్చిత్తం వల్ల కాదు. ఎన్ని వైకుంఠ ఏకాదశులు వచ్చినా ఎన్ని తూర్పు ద్వారాలు తెరుచుకున్న నీ మనసు కలుషితం గా ఉన్నంత సేపు ఏ దేవుళ్లు నిన్ను రక్షించరు. నువ్వు చేసిన పాపాలకు రక్షించని దేవుడు గా తోస్తే “నువ్వు ఉన్నవా. అసలు ఉన్నవా ఉంటే కళ్లు మూసుకున్నవా” అంటూ మండి పడతావు. అదే నీకు అనుకూలంగా ఉంటే ‘ఆపద బాంధవా అనాధ రక్షక” అంటూ సాష్టాంగ పడతావు. ఇదీ నీ నైజం! మీరు బలహీన క్షణంలో పరిస్థితిని ఎదుర్కోవటానికి మీకు ఎప్పుడైనా అతీంద్రియ బలం అవసరమా? ఆ సమయంలో  దేవుణ్ణి ఏమి ప్రార్థించాలో తెలియదు? దేవుడు మీకోసం వేచి ఉండడు. మీకు అవసరమైన సమయంలో మనకు బలాన్ని అందించాలని కూడా ఆయన కోరుకొడు.  తప్పు చేసినప్పుడు దేవుణ్ణి మొక్కడానికి మీరు భయపడుతున్నారు.    మీరు బలహీనంగా ఉన్నప్పుడు, అలసిపోయినప్పుడు లేదా నిలబడటానికి సిద్ధంగా లేనప్పుడు మరియు ఏమి అడగాలో తెలియక, ఈ పదాలతో పాటు దేవుణ్ణి ప్రార్థించడానికి చేతులు రావడం లేదు. అందుకు కారణం నీ మనసు! నీ మనసులో భావాలు ఎలా ఉంటే అలా దేవుడు మీకు కనబడతాడు.

అలసిపోయినప్పుడు బలం కోసం ఆరాధన పూర్వక మనసును దేవునిపై లగ్నం చేయండి.దేవుడా, నేను అలసిపోయాను. నా శక్తి కుంగిపోతుంది, నా ప్రేరణ వెనుకబడి ఉంది. నేను మీకు చాలా అవసరం. మళ్లీ ట్రాక్‌లోకి రావడానికి నాకు మీ బలం,  మీ తాజా స్పర్శ అవసరం అని ప్రార్థించండి. అది మనస్ఫూర్తిగా ఆ ఆనందమే మీకు సరికొత్త  బలం. అది నిజమైతే, నీ మనస్సు, శరీరం, ఆత్మ, అలసిపోయిన అన్ని భాగాలను భర్తీ చేయడానికి మీ ఆనందం మీకే అవసరం. అప్పుడు దేవుడు నిన్ను కరుణించినట్టే.

ఇది చదవండి: ధర్మపురి క్షేత్రంలో కన్నులపండువగా ముక్కోటి ఏకాదశి

జీవితం యొక్క ఒత్తిళ్లు కొన్నిసార్లు మిమ్మల్ని ఒక మూలలోకి నెట్టివేస్తాయి, ముందుకు సాగడానికి మిమ్మల్ని నిస్సహాయంగా మారుస్తాయి. అలాంటప్పుడు దేవుడు గుర్తుకు వచ్చినట్టే…మీకు అత్యంత ఆనందంగా ఉన్నప్పుడు కూడా దేవుడి పై చిత్తం ఉంచండి.  యూస్ అండ్ త్రో గా దేవుడిని చూస్తే ఆయన నిన్నూ అలాగే చూస్తాడు. దేవుడు మట్టి బొమ్మ అనుకుంటే ప్రాణం పోసింది నువ్వే… పెంచి పోషిస్తుంది నువ్వే. అందుకే ఆ ప్రాణం నీది అందులో ఉన్న మనసు నీది… గుడికి వెళ్లి ఆరాధించే సమయం లో మనసు కలుషితం కాకుండా చూసుకో. విశ్వమంతా దేవుడు ఉన్నాడు. అంటే అది నీ మనసే. అందుకే గజేంద్ర మోక్షం లో చిన్నప్పటి పద్యం మనకు గుర్తుకు రావాలి…

“ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై

యెవ్వనియందు డిందు పరమేశ్వరుడెవ్వడు

మూల కారణంబెవ్వ డనాది మధ్య లయుడెవ్వడు

సర్వము దాన యైున వాడెవ్వడు వాని

నాత్మభవు నీశ్వరుని శరణంబు వేడెదన్‌!!

బమ్మెర పోతనామాత్యుని శ్రీమహాభాగవతంలో అష్టమ స్కంధంలోని గజేంద్ర మోక్షణంలోనిదీ పద్యం. ఇది గజేంద్రుని వేడుకోలు. ఈ విశ్వం ఎవరి వలన ఉద్భవించిందో, ఎవ్వని యందు లీనమై ఉంటుందో, ఎవ్వని యందు లయిస్తుందో.. సర్వమూ తానే అయి ఉన్నవాడెవ్వడో.. అట్టి పరమేశ్వరుని శరణు కోరుతున్నానని దీని అర్థం!!

ఇది చదవండి: తలుపులు తెరిస్తే కదా తలపులు మెరిసేది

Ramprasad Rao Bandaru
Ramprasad Rao Bandaru
Mr. Bandaru Rama Prasad has been a journalist since his 21st year. Starting with Andhra Bhoomi as a sub-editor he became desk in-charge at Andhra Prabha before becoming a freelancer and a script writer in electronic medium. Did his MA from Osmania University. He founded Amrita Tele Films..

Related Articles

2 COMMENTS

  1. Thanks fоr every other informative blog. The place else may I am getting that kind of infο written in such a perfect
    method? I hаve a challenge that І am just now running on, and
    I have been at the glancе out for such information.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles