రాజమహేంద్రవరం : తూర్పుగోదావరి జిల్లాలో కరోనా యూకే స్ట్రెయిన్ ప్రవేశించినట్టు జిల్లా వైద్యాధికారి గౌరీశ్వర్ తెలియజేశారు. ఇక్కడి కృష్ణానగర్ నివాసి మేరీకి కొత్త స్ట్రెయిన్ సోకినట్టు నిర్ధారించారు. ఇంగ్లండ్ నుంచి మొత్తం 114 మంది తిరిగి వచ్చారనీ, వారిలో 111 మందికి కరోనా పరీక్ష చేశామనీ గౌరీశ్వర్ తెలిపారు. వారిలో ఇద్దరికి పాజిటీవ్ వచ్చిందని తెలియజేశారు. ప్రైమరీ కాంటాక్ట్ గా ఉన్న మేరీ కుమారుడిని పరీక్షించగా నెగెటీవ్ వచ్చింది. కాకినాడ వెంకట్ నగర్ కి చెందిన ఒక వ్యక్తికి కూడా పాజిటీవ్ అని తేలింది. ప్రైమరీ కాంటాక్ట్ లో ఉన్న మరి ముగ్గురికి పాజిటీవ్ తేలింది. పరీక్షల నిమిత్తం నమూనాలను హైదరాబాద్ కి పంపించారు. యూకే నుంచి తిరిగి వచ్చిన వారిలో మరి ముగ్గురిని పరీక్షించవలసి ఉన్నదని గౌరీశ్వర్ అన్నారు. పాజిటీవ్ గా గుర్తించిన నలుగురు వ్యక్తులను కలుసుకున్న సుమారు వెయ్యిమందికి టెస్టులు నిర్వహిస్తున్నామని గౌరీశ్వర్ వెల్లడించారు.
ఇది చదవండి: బ్రిటన్ విమానాలపై నిషేధం పొడిగించిన కేంద్రం
ఇది చదవండి:కోవిద్ ‘టీకా’తాత్పర్యం
ఇది చదవండి:దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ డ్రైరన్ కు ముమ్మర ఏర్పాట్లు