Saturday, November 23, 2024

గాయని సునీత పెళ్లి వాయిదా?

ప్రముఖ గాయని‌ సునీత‌, డిజిటల్ మీడియా సంస్థ అధిపతి రామ్ వీరపనేనితో  ఈ నెల 27న జరగవవసిన పెళ్లి వాయిదా  పడినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నెల 8 వ తేదీన వీరికి నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. కొత్త సంవత్సరంలో  (2021) పెళ్లాడుతారని, మరో మంచి ముహుర్తం చూసుకోవలసి ఉందని రెండు కుటుంబాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. 19 ఏళ్ల వయసులోనే పెళ్లయిన సునీత   ఇద్దరు పిల్లలు కలిగాక భర్తతో అభిప్రాయభేదాలు వచ్చి విడాకులు తీసుకున్నారు. ఇప్పడు కట్టుకోబోయే రామ్ కు కూడా ద్వితీయ వివాహమే.

‘‘ఆయన మంచి స్నేహితుడే కాదు…మంచి భాగస్వామి కూడా. ఆయనతో జీవితం పంచుకోబోతున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం. నా వ్యక్తిగత జీవితాన్ని అర్థం చేసుకున్నవారందరికీ ధన్యవాదాలు‘అని నిశ్చితార్థం సందర్భంగా సునీత ట్వీట్ చేశారు.

ఇదీ చదవండి: గాయని సునీతకు నిశ్చితార్థం

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles