Friday, November 22, 2024

భోగరాజు తెలుగు వారి `భాగ్య`రాజు

నమ్మిన విషయాలలో రాజీలేని నాయకుడు.జన్మభూమి,అమ్మభాష అంటే మమకారం.వాటిని కించపరిచినా,ఇతర విషయాలలో అభిప్రాయభేదాలు వస్తే పార్టీలో ఎంతటి వారితేనైనా ఢీ అంటే ఢీ. ఆయనే పట్టాభి. సాధారణ కుటుంబంలో పుట్టి ఉపకారవేతనాలతో వైద్యవృత్తి దాకా ఎదిగిన భోగరాజు పట్టాభి సీతారామయ్య జనం కోసం, ప్రత్యేకించి ఆంధ్రుల సంక్షేమం కోసం పరితపించారు. కొన్నిపెద్ద పదవులను తృణప్రాయంగా వదులుకున్నారు. మచిలీపట్నంలో ప్రారంభించిన డాక్టర్ ప్రాక్టీస్ ను మహాత్మాగాంధీ సందేశాలతో ప్రభావితుడై వదిలి స్వరాజ్య ఉద్యమం వైపు మళ్లారు.దేశం కోసం లాభదాయకమైన సంపాదనను కాదను కున్నారు. కాంగ్రెస్ పార్టీలో గాంధీజీకి అతి సన్నిహితంగా మెలిగారు.

త్రిపురలో 1939లో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికలలో గాంధీజీ సహా అనేక మంది సభ్యులు భోగరాజు అభ్యర్థిత్వం పట్ల మొగ్గుచూపారు. అయితే అతివాద అభ్యర్థి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రతిపాదించిన విప్లవాత్మక కార్యక్రమాలు యవతను బాగా ఆకర్షించడంతో ఆయన విజయం సాధించారు. భవిష్యత్ లో జరగబోయే ఉమ్మడి మద్రాసు రాష్ట్ర విభజన సమయలో, తమిళ ప్రాబల్యం గల ప్రాంతాలను ఆంధ్రలో కలిపేందుకు పట్టాభి మద్దతు ఇస్తారన్న అనుమానం కూడా ఆయన ఓటమికి కారణంగా చెబుతారు. ’పట్టాభి ఓటమి నా ఓటమి’ అని గాంధీజీ వ్యాఖ్యానించడాన్ని బట్టి భోగరాజు వారి ఉన్నతి తెలుస్తుంది. 1948లో జరిగిన కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలలో గెలిచి స్వతంత్ర భారత తొలి కాంగ్రెస్ అధ్యక్షుడిగా నిలిచారు. 1952లో రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ మంత్రి పదవి ఇవ్వజూపగా ’అస్తమిస్తున్న సూర్యుడిని. నాకింకా పదవులెందుకు? నాకు ఏ పదవులపైనా ఆశలేదు. కేంద్రంలో మంత్రి వదవిని ఎన్నడు అశించలేదు` అంటూ తిరస్కరించారు. ప్రధానితో ఆయనకున్న సంబంధాలను బట్టి, ఆయన ఒకవేళ మంత్రి పదవి స్వీకరించినా అందులో ఎంతకాలం కొనసాగుతారో?అని కూడా అనుమానాలు ఉండేవని రాజకీయ విశ్లేషకుల వ్యాఖ్య. కేంద్రంలో పదవి కాదన్న పట్టాభి మధ్యప్రదేశ్ గవగర్నర్ గా ఐదేళ్లు సేవలు అందించారు.

ఆర్థికవేత్తగా…
ఆర్థికాభివృద్ది లేనిదే సమాజం ముందడుగు వేయలేదనేవారు పట్టాభి. మొదటి నుంచి పొదుపరితనం కలిగిన ఆయన ఆర్థిక క్రమశిక్షణను బాగా పాటించేవారు. అనవసరంగా చిన్నమొత్తం కూడా ఖర్చు చేసేవారు కాదు. కాంగ్రెస్ మహాసభలకో, ఏఐసీసీ సమావేశాలకో వెళితే నాలుగైదు రూపాయలు మాత్రమే ఖర్చయ్యేదట. ఉత్తర ప్రత్యుత్తరాలకు ఉపయోగించే కాగితాల విషయంలోనూ పొదుపు పాటించే వారు. తనకు అందిన ఉత్తరాల కవర్లను భద్రపరిచి వాటి రెండవ వైపున రాసే వారు.దీనిని లోభితనం కంటే జాగ్రత్తగా అనే చెప్పాలి. కాయితం ఆదా చేయాలని, కాగితం తయారీ కోసం విలువైన కలపను కోల్పోవడాన్నిఅరికట్టాలనే నేటి నినాదాన్ని పట్టాభి ఆనాడే నిరూపించారు. ఆంధ్రులకు కార్యకుశలత లేదని, వారు వ్యాపారదక్షులు కాదని, ఒకవేళ సంస్థలు ప్రారంభించినా ఎంతోకాలం మనుగడ సాగించలేవని అప్పట్లో ప్రచారంలో ఉందట.ఆంధ్రజాతికి ఆర్థిక సంస్థలు లేకపోవడం లోటుగా కూడా భావించడంతో పాటు పై అంశాలను సవాల్ గా తీసుకొన్నారు. అలా వచ్చినవే ఆంధ్రాబ్యాంకు (ఇటీవలే యూనియన్ బ్యాంకులో విలీనమైంది), ఆంధ్ర ఇన్సూరెన్స్ కంపెనీ, ఆంధ్ర సైంటిఫిక్ కంపెనీ, భారత లక్ష్మీ బ్యాంకు, కృష్ణా కో-ఆపరేటివ్ బ్యాంకు తదితరాలు.ఆంధ్రాబ్యాంకు ద్వారా వ్యవసాయదారులకు రుణాలిచ్చిసహకరించారు. చిన్న మొత్తంలో డిపాజిట్లు సేకరించి పొదుపును ప్రోత్సహించారు.

భాషాప్రయుక్త రాష్ట్ర ఉద్యమనేత:
భాషా ప్రాతిదపదికపై తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ పట్టాభి ఎంతో కృషిచేశారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఆవశ్యకత గురించి ఆంగ్లంలో ఒక గ్రంథంరాశారు. భాషాప్రయుక్త రాష్ట్ర కోసం అధిష్ఠానంతో ఎడతెగని పోరాటం సాగించారు.ఆయన చొరవతోనే 1908లో బందరులో (మచిలీపట్నంలో) ఆంధ్ర రాష్ట్రోద్యమానికి అంకురార్పణ జరిగింది. ఆ సమావేశానికి హాజరైన తెలుగు జిల్లాల ప్రముఖు లంతా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం చర్చించిన మీదటనే బాపట్లలో 1913లో తొలి ఆంధ్ర మహాసభ ఏర్పాటైంది. పట్టాభి కృషితోనే కాంగ్రెసు పార్టీ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ 1920లో సూచనప్రాయంగా ఆమోదించింది.అయినా రాష్ట్ర ఏర్పాటులో జాప్యాన్ని నిరసిస్తూ,1937-39 మధ్య ఆంధ్రరాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మరింతగా పోరాడారు.1948లో జయపూర్ కాంగ్రెస్ లో పట్టాభి అధ్యక్షతన జవహర్, వల్లభ్ భాయ్ పటేల్, పట్టాభిలతో కమిటి ఏర్పాటుకాగా కమిటీ సమర్పించినదే జేవీబీ నివేదిక.

తెలుగుతేజం.. విద్యాప్రదాత:
ఆంధ్రులకు జాతీయ విద్యాబోధనకు ప్రత్యేక సంస్థ అవసరమని భావించి కోపెల్ల హనుమంతరావుగారితో కలసి మచిలీపట్నంలో ఆంధ్రజాతీయ కళాశాల నెలకొల్పారు. విద్యార్జనకు, ఉపాధి అవకాశాలకు ఆంగ్లం అవసరాన్ని గుర్తించి, ఆ మాధ్యమంలో భోధనను ప్రోత్సహిస్తునే మాతృభాషను గౌరవించేవారు. తాను స్థాపించిన సంస్థలన్నింటిలోనూ ఉత్తర ప్రత్యుత్తరాలు, లావాదేవీలు తెలుగులోనే జరగాలని నియమం పెట్టారు. ఆచరించి చూపారు కూడా.ఆయన వేష, భాషల్లో ఎప్పుడూ తెలుగుతనం ఉట్టిపడుతూ ఉండేది.అఖిల భారత కాంగ్రెసు అధ్యక్షుడుగా వ్యవహరించినా, మధ్యప్రదేశ్ గవర్నర్ గా చేసినా ఆయన ఆహార్యంలో మార్పులేదు.

కాంగ్రెస్ చరిత్రకారుడు….
పట్టాభి రాసిన గ్రంథాలలో కాంగ్రెసు చరిత్ర (History of Indian National Congress) విశిష్టమైనది. సుమారు 1600 పుటల ఈ గ్రంథాన్ని కేవలం రెండు నెలలో పూర్తిచేశారు. కేవలం తన జ్ఞాపక శక్తితో రాసి సంచలనం సృష్టించాడు. జ్ఞాపక శక్తికి ఆయన పెట్టింది పేరు. ఏకసంథాగ్రాహి. దేని గురించైనా,ఎన్నేళ్ల తరువాతైనా అంకెలు సహా గడగడ చెప్పేవారు. ఆయన సంస్కృత,ఆంగ్ల, ఉర్దూ భాషల్లో ప్రావీణ్యులయ్యేందుకు జ్ఞాపకశక్తే ఉపకరించిందంటారు. ఆయా భాషల్లో ఆయన ప్రసంగిస్తుంటే వాటిలో నిష్ణాతులైన వారే ముగ్ధులయ్యేవారట. ఏఐసీసీలో ఆయన చేసిన ప్రసంగాలు ఉర్దూ పండితులు ఉర్దూ పండితులు ఉర్రూతలూగే వారట.మధ్యప్రదేశ్ గవర్నర్ గా ఒక విశ్వవిద్యాలయం స్నాతకోపన్యాసాన్ని సంస్కృతంలో ఇవ్వడంతో ఆయన భాషా పటిమకు అక్కడ సంస్కృత పండితులు ఆశ్చర్యపోయారు. ఆయన చదివింది వైద్య శాస్త్రమైనా ఆయన వివిధ రంగాల అంశాలపై చేసే ప్రసంగాలు, చెప్పే విషయాలను బట్టి చరిత్రోపన్యాసకుడో, అర్థశాస్త్ర నిపుణుడో అనుకొనేవారట.పంజాబు వధలు, ఖద్దరు, స్వరాజ్యము, భారత జాతీయ విద్య, మన నేత పరిశ్రమ వంటి పుస్తకాలు రాశారు. విలియం టారెన్స్ రాసిన Empire in Asia అనే గ్రంథాన్ని తెలుగులో తర్జుమా చేశారు. క్విట్ ఇండియా ఉద్యమ ప్రారంభములో పట్టాభిని అరెస్టు చేసి అహ్మద్ నగర్ కోటలో బంధించిన సమయంలో తమ దినచర్యను గూర్చి విస్తారమైన డైరీ నిర్వహించారు. దీనినే అనంతరకాలంలో ఫీదర్స్ అండ్ స్టోన్స్ (ఈకలు, రాళ్ళు) గా ప్రచురించారు.

పాత్రికేయునిగా:
బోగరాజు పాత్రికేయునిగా కూడా ప్రసిద్దులు. 1919లో మచిలీపట్నం జన్మభూమి అనే ఆంగ్ల వారపత్రికను స్థాపించారు. అప్పట్లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రం పరిధిలోని తెలుగునాట ఆంధ్రుల సంపాదకత్వంలో వెలువడే ఆంగ్ల పత్రికలు లేవు. ఆ కొరతను తీర్చడానికి ప్రారంభింన పత్రిక దాదాపు పుష్కర కాలంపాటు కొనసాగింది.ఈ పత్రికలోని సంపాదకీయ వ్యాసాలు ఆయన ఆంగ్లభాషా నైపుణ్యాన్ని దేశానికి చెప్పాయి.

ముక్కుసూటి తనం:
డాక్టర్ పట్టాభితో ముక్కుసూటి మనస్తత్వం.అవసరమైతే ఎంతటి వారికైనా మాటకు మాట చెప్పేవారు.కాంగ్రెస్ లో గాంధీజీనీ మినహాయిస్తే అగ్రనాయకు లెవ్వరిని లక్ష్యపెట్టేవారు కాదట. పట్టాభికి స్వరాష్ట్రంలోనే పలుకుబడిలేదని జవహర్ లాల్ నెహ్రూ వ్యాఖ్యానిస్తే, ఉత్తరప్రదేశ్ లో ఏయే కాంగ్రెస్ ఎన్నికలలో నెహ్రూ ఓటమి పాలైందీ వివరిస్తూ ఆయనకూ సొంత రాష్ట్రంలో పలుకుబడి లేదని వాదించారు. అలాగే సర్దార్ వల్లభ్ బాయి పటేల్ ప్రత్యేకాంధ్ర రాష్ట్రం ఉద్యమం గురించి చేసిన చులకన వ్యాఖ్యకు తీవ్రంగా స్పందించారు. `ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. బ్రిటీష్ వారు ముద్రించిన నాణేలపై ఇంగ్లీషు హిందీ, బెంగాలీ తర్వాత తెలుగు ఉంది. మీ గుజరాతీ భాషకానీ, మరో భారతీయ భాష కానీ ఉందా? అని అణాకాసును చూపుతూ ఎదురుదాడికి దిగారట పట్టాభి.

ప్రస్తుత పశ్చిమ గోదావరి జిల్లా గుండుగొలనులో 1880 నవంబర్ 24న జన్మించిన సీతారామయ్య 1959 డిసెంబర్ 17న హైదరాబాద్ లో కన్ను మూశారు.

Dr. Aravalli Jagannadha Swamy
Dr. Aravalli Jagannadha Swamy
సీనియర్ జర్నలిస్ట్

Related Articles

19 COMMENTS

  1. Im impressed, I must say. Really seldom do I see a blog thats both educational and entertaining, and let me tell you, youve hit the nail on the head. Your opinion is outstanding; the matter is something that not enough people are speaking intelligently about. Im really happy that I stumbled across this in my search for something relating to this.

  2. I thought it was heading to become some boring aged publish, however it really compensated for my time. I will post a hyperlink to this web page on my weblog. Im positive my guests will come across that really helpful.

  3. Hullo, simply turned into aware of your website thru Yahoo, and found that its really educative. I’m gonna be careful for brussels. I will appreciate when you continue this in future. Lots of other people shall be benefited from your post. Thanks!

  4. There are certainly a lot of details like that to take into consideration. That is an excellent point to bring up. I offer the thoughts above as general inspiration but clearly you will find questions like the one you bring up where the most critical thing will be working in honest good faith. I don?t know if finest practices have emerged around things like that, but I am sure that your job is clearly identified as a fair game. Both boys and girls really feel the impact of just a moments pleasure, for the rest of their lives.

  5. This is a different sort of opinion that many people dont usually talk about. Usually when I find stuff like this I stumble it. This article probably wont do well with that crowd. Ill look around and find another article that may work.

  6. Thank you pertaining to giving this excellent content on your web-site. I discovered it on google. I may check back again if you publish extra aricles.

  7. My sister bookmarked this internet site for me and I have been going through it for the past several hrs. This is really going to help me and my classmates for our class project. By the way, I like the way you write.

  8. Hey there I am so happy I found your web site, I really found you by mistake, while I was browsing on Google for something else, Anyways I am here now and would just like to say cheers for a incredible post and a all round entertaining blog (I also love the theme/design), I don’t have time to look over it all at the minute but I have bookmarked it and also included your RSS feeds, so when I have time I will be back to read much more, Please do keep up the awesome job.

  9. Thanks pertaining to spreading this particular good content material on your web site. I came across it on the internet. I will check to come back once you publish much more aricles.

  10. I admire the beneficial information and facts you provide inside your posts. Ill bookmark your weblog and also have my kids examine up right here usually. Im quite sure theyll discover a lot of new things right here than anybody else!

  11. What a web page you have here. You have a actual knack for making a site readable and easy about the eyes. Some sites appear like train wrecks, but not this 1 – it is a joy to learn. Don’t have time to learn all the content pieces right here, I found your web site while searching for something else on Yahoo. But I’ve bookmarked your homepage and can go to it regularly to study what’s new http://www.piano.m106.com

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles