Sunday, December 22, 2024

అమరావతిలో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు

మూడు రాజధానులకు నిరసనగా రైతులు, మహిళలు అమరావతిలో ఉద్యమం చేపట్టి రేపటికి 365 రోజులు కానుంది. ఈ నేపథ్యంలో అమరావతి పరిరక్షణ సమితి నేతృత్వంలో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఈరోజు ఉద్యమ ప్రాంగణానికి భారీ సంఖ్యలో రైతులు, మహిళలు చేరుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. అమరావతే రాజధానిగా కొనసాగాలని కోరుతూ కాంగ్రెస్ కార్యకర్తలు పాదయాత్రలో పాల్గొన్నారు.

మహిళా రైతులను దూషిస్తున్నారు:

ఉద్యమం చేస్తున్న మహిళలపై అసత్య ప్రచారం చేస్తున్నారని రాజధాని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. భూములు పోగొట్టుకుని ఉద్యమంలోకి వచ్చాక ఎవరినీ ఒక్క మాట కూడా అనలేదు. శాంతియుతంగా ఉద్యమాలు చేస్తున్నా మమ్మల్ని బూతులు తిడుతున్నారు. మహిళలు అని చూడకుండా కించపరుస్తూ మా మీద సోషల్ మీడియాలో అసభ్య పదజాలం ఉపయోగించి ప్రచారం చేస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజుకు 400 తీసుకుని మమ్మల్ని కొట్టడానికి, చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. మహిళలపట్ల దురుసుగా ప్రవర్తించడమే కాకుండా బూతులు తిడుతున్నారని మహిళా రైతులు వాపోతున్నారు. చట్టపరంగా, న్యాయబద్దంగా చేస్తున్న ఉద్యమానికి పోలీసులు సహకరించాలని కోరారు. మేం ఏం తప్పు చేస్తున్నారం. రోజులు 300 తీసుకుని పలావు తిని వాళ్లతో దెబ్బలు తినాల్సి వస్తోంది. ఉద్యమానికి అడ్డురామని ఏపీ డీసీపీ  హామీ ఇస్తేనే ఇక్కడ నుంచి కదులుతామని రాజధాని ప్రాంత మహిళా రైతులు అంటున్నారు.

ఇది చదవండి : రాజధాని రైతుల గోడు

ఏపీ సీఎం అత్యంత ఆస్తిపరుడు:

ఆదాయనికి మించి జగన్ ఆస్తులు సంపాదివంచారని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య అన్నారు. 2004లో 2 లక్షల 30 వేలు ఇన్ కంటాక్స్ కట్టిన వ్యక్తి రెండు సంవత్సరాలు తిరిగే సరికి 70 కోట్లు అడ్వాన్స్ టాక్స్ ఎలా కట్ట గలిగారని ప్రశ్నించారు. దేశంలోని రాజకీయ నాయకుల్లో ఏపీ సీఎం జగన్ అంత ఆస్తి పరుడు లేరని వర్ల రామయ్య అన్నారు. మంచి చెడులు, ప్రేమ ఆప్యాయతలు తెలిసిన వ్యక్తితో  పోరాటం చేయవచ్చని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య అన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మూర్ఖత్వం తో పనిచేస్తున్నారని అలాంటి వ్యక్తి తో పోరాటం చేయడం కష్టమని తెలిపారు. టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య అన్నారు. జగన్ అసూయ, ఈర్ష్యాద్వేషాలతో రగిలిపోతున్నాడని అలాంటి వ్యక్తితో పోరాటం చేయడం అంత ఈజీ కాదని వర్ల రామయ్య అన్నారు.

Paladugu Ramu
Paladugu Ramu
సీనియర్ సబ్ ఎడిటర్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles