- భూసర్వేతో సమూల మార్పులు
- ప్రతి యజమానికి డిజిటల్ కార్డు
- సర్వే ఆఫ్ ఇండియాతో ఒప్పందం
డా.ఆరవల్లి జగన్నాథ స్వామి
ఆంధ్రప్రదేశ్ లో ఈ నెల 21వ తేదీన ‘వైయస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష పథకం’ ప్రారంభమవుతాయి. దీన్ని అమలు చేసే విధానంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం నాడు అధికారులతో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని 17,460 గ్రామాల పరిధిలో 1.26 లక్షల చదరపు కిలోమీటర్ల మేర భూ సర్వే జరుగుతుంది. దీనిని మూడు విడతలగా నిర్వహిస్తారు. అందుకోసం సర్వే ఆఫ్ ఇండియాతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చు కుంటుంది. సర్వే పూర్తై, రికార్డులు సిద్ధం కాగానే అప్పటి నుంచి సచివాలయంలో రిజిస్ట్రేషన్ సేవలు మొదలవుతాయని తెలిపారు.భూ యజమానులకు మేలు చేకూరేలా చేపట్టిన ఈ కార్యక్రమం గురించి ప్రతిపక్షానికి మద్దతు ఇస్తున్న పత్రికలు అసత్య ప్రచారం చేస్తున్నాయని, వీటిని తిప్పికొట్టవలసిన బాధ్యత అధికారులపై ఉందని ముఖ్యమంత్రి అన్నారు.
సర్వే సాగేది ఇలా
గ్రామాల్లో సర్వే పూర్తయి, మ్యాపులుసిద్ధం కాగానే అదే గ్రామ సచివాలయంలో భూరిజిస్ట్రేషన్ సేవలు అందుబాటులోకి వస్తాయి. సర్వే పూర్తయ్యాక ఆ రికార్డులను మరెవ్వరూ టాంపర్ చేయలేని రీతిలో భద్రపరచాలని సీఎం ఆదేశించారు. ఈ సర్వే కోసం ప్రతి మండలానికి ఒక డ్రోన్ బృందం, డేటా ప్రాససింగ్ టీం, రీసర్వే టీం ఉంటాయని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 9400 మంది సర్వేయర్లకు శిక్షణ ఇచ్చామని చెప్పారు. సర్వే శిక్షణకోసం తిరుపతిలో 50 ఎకరాల్లో కాలేజీ ఏర్పాటు చేస్తామని సీఎం చెప్పారు. భూ వివాదాల పరిష్కారానికి మొబైల్ ట్రైబ్యునళ్లు ఏర్పాటు చేస్తారు. వివాదాల నమోదుకూ రిజిస్టర్లు ఏర్పాటు చేస్తారు.
Also Read: పాల వెల్లువ ద్వారా మహిళా సాధికారత దిశగా జగన్ సర్కార్