Sunday, November 24, 2024

మహిళా కమిషన్ కు అభ్యర్థే దొరకలేదా?

తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ కు ఛైర్ పర్సన్ నియామకానికి రెండేళ్లుగా సరైన అభ్యర్థే దొరకడం లేదా ? అని రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ నియామకం పట్ల జాప్యానికి కరీంనగర్ కు చెందిన రేగులపాటి రమ్యరావు రాసిన లేఖను హైకోర్టు ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించింది. ‘అభ్యర్థిని గుర్తించడంలో ఇబ్బందులు ఏమిటి? అర్హులైన వారు దొరకలేదా ? నియామక ప్రక్రియ ఎక్కడ నిలిచిపోయింది ?’ అని ప్రశ్నలు వేసింది. దీనికి సమాధానంగా నియామక ప్రక్రియ కొనసాగుతోందని, ఈ నెల 31 నాటికి పూర్తవుతుందని అడ్వకేట్ జనరల్ తెలిపారు. దానికి కోర్టు స్పందిస్తూ గడువులోగా నియామకం పూర్తికాకపోతే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వ్యక్తిగతంగా హాజరు కావాల్సిఉంటుందని చెబుతూ కేసు విచారణను వచ్చే నెల 4 వ తేదీకి వాయిదా వేసింది.

Paladugu Ramu
Paladugu Ramu
సీనియర్ సబ్ ఎడిటర్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles