Sunday, November 24, 2024

అనుచిత వ్యాఖ్యలతో జస్టిస్ కర్ణన్ అరెస్టు

చెన్నై : విశ్రాంత న్యాయమూర్తి  జస్టిస్ కర్ణన్ ను  కేంద్ర నేర విభాగం పోలీసులు చెన్నైలో నిన్న అరెస్ట్  చేశారు. న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు  చేశారని ఆరోపణలపై ఈ చర్య తీసుకున్నారు. మహిళలపైనా ,  సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులపైనా  కొద్ది రోజుల క్రితం ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చక్కెర్లు కొట్టింది. ఆ వ్యాఖ్యలకు ఆగ్రహించిన మద్రాస్ హైకోర్టు కు చెందిన న్యాయవాదులు కొందరు అత్యున్నత న్యాయస్థానం  ప్రధాన న్యాయమూర్తికి  లేఖ కూడా రాశారు. ఈ అంశంపై విచారణ కోసం జస్టిస్ కర్ణన్ రెండుసార్లు  పోలీసుల ఎదుట హాజరరయ్యారు. అయితే  ఆయనను ఎందుకు అరెస్ట్ చేయడంలేదో వివరణ  ఇవ్వాలని  హైకోర్టు రాష్ట్ర డీజీపీని,  చెన్నై నగర పోలీసు కమిషనర్ ను మంగళవారం ఆదేశించింది  ఈ నేపథ్యంలో మరునాడు  ఆయనను  అరెస్టు చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles