మచిలీపట్నం: ఆంధ్రప్రదేశ్ రవాణా, సమాచారశాఖ మంత్రి పేర్నినానిపై ఆదివారం ఉదయం హత్యాయత్నం జరిగింది. ఇక్కడ తన నివాసం వద్ద గుర్తు తెలియని వ్యక్తి ఎవరో మంత్రిపై తాపీతో దాడి చేశాడు. నానికి తృటిలో ప్రమాదం తప్పిపోయింది. ఆయన చొక్కా చినిగింది. నిందితుడిని వెంటనే మంత్రి అనుచరులు పట్టుకున్నారు. నిందితుడిని బడుగు నాగేశ్వరరావుగా గుర్తించారు. అతడిని తాపీ మేస్త్రీగా గుర్తుపట్టారు. మద్యం మత్తులో దాడి చేసినట్టు చెబుతున్నారు.
ఉద్దేశపూర్వకంగా, పథకం ప్రకారం దాడి చేశాడా లేక తాగిన మత్తులో ఏమి చేస్తున్నాడో తెలియక దాడి చేశాడా అనే విషయాన్ని పోలీసులు పరిశోధిస్తున్నారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.