హైదరాబాద్ : తెలంగాణలో కోవిడ్ సోకిన వారి సంఖ్య 2 లక్షల 66 వేల 904 (2, 66,904) కి చేరింది. గత 24 గంటల్లో 41 వేల పైగా నిర్వహించిన పరీక్షల్లో 862 మందికి కరోన వైరస్ పాజిటివ్ నిర్దారణ అయినట్లు వైద్య ఆరోగ్య శాఖ గురువారం ఉదయం విడుదల చేసిన బులిటిన్ లో పేర్కొంది. రాష్ట్రంలో కోవిడ్ రికవరీ రేటు 95.41 శాతాని చేరింది. కోవిడ్ నుంచి నిన్న మరో 9 వందల 61 మంది కోలుకోవడంతో వారి సంఖ్య 2 లక్షల 54 వేల 676 కి చేరింది. కరోనా లక్షణలతో నిన్న మరో ముగ్గురు మరణించారు. దీంతీ రాష్ట్రంలో కోవిడ్, సంబంధిత ఇతర సమస్యలతో మరణించిన వారి సంఖ్య 1444 గా నమోదైందని ఆ శాఖ తెలిపింది. రాష్ట్రంలో ప్రస్తుతం 10 వేల పైగా యాక్టివ్ కేసులకుగాను 8 వేల మంది పైగా హోం ఐసోలేషన్ లో ఉన్నారని సమాచారం.
దేశ రాజధానిలో…
దిల్లీ: దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. బుధవారం నాడు దేశ రాజధాని దిల్లీలో 5,246 కొత్త కేసులు నమోదు కాగా, పాజిటివిటీ రేటు 8.49 శాతం తగ్గింది. కవరీ రేటు 93.66 శాతంగా నమోదైంది. దేశవ్యాప్తంగా నిన్న వరసగా రెండో రోజు 40వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా నివేదకి ప్రకారం నిన్న ఒక్కరోజే 44,489 కొత్త కేసులు వెలుగుచూశాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య 92,66,705కి చేరింది. ఇప్పటి వరకు 86,79,138 మంది కోలుకోగా.. ఆ రేటు 93.66శాతంగా ఉంది. నిన్న 524 మరణాలు సంభవించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,35,223కి చేరింది. గడిచిన 24 గంటల్లో 10,90,238 నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది.