‘నివర్’ తుఫాను ప్రమాదం హెచ్చరికలతో నెల్లూరు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కృష్ణపట్నం రేవులో రెండో నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. తీరప్రాంతంలోని 12 మండలాల్లో అత్యవసర రక్షణకు పడవలు సిద్ధం చేశారు. ఆయా మండలాలకు ప్రత్యేక అధికారుల నియమించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. అధికారులు, ఉద్యోగులకు సెలవులు రద్దు చేశారు. కలెక్టర్ చక్రధర బాబు విద్యా సంస్థలకు మూడు రోజులు సెలవు ప్రకటించారు. కావలి, నెల్లూరు, గూడూరు, నాయుడుపేట రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు. కలెక్టరేట్ లో 1077 టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటైంది.