విశ్వ హిందీ పరిషత్తు అధ్యక్షుడు అచార్య యార్లగడ్డ
తెలుగు వేషం, హిందీ ప్రసంగంలో ఆకట్టుకన్న వైఎల్పి
కజకిస్తాన్ వేదికగా ప్రధమ హిందీ సమ్మేళనం
అంతర్జాతీయ స్ధాయిలో హిందీ మనుగడను పెంపొందించేందకు కట్టుబడి ఉన్నామని విశ్వ హిందీ పరిషత్తు అధ్యక్షుడు, పద్మభూషణ్ అచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ అన్నారు. కజకిస్తాన్ దేశంలోని అల్ మి నగరంలో గురువారం నిర్వహించిన ప్రధమ హిందీ సమ్మేళనంకు యార్లగడ్డ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. పలు యూరేషియన్ దేశాల నుండి ప్రతినిధులు హాజరు కాగా, అక్కడి ఆల్ ఫరాబి విశ్వవిద్యాలయం, భారత విదేశాంగ శాఖ, వివేకానంద కల్చరల్ సెంటర్ , భాతర రాయబార కార్యాలయం సంయిక్తంగా ఈ అంతర్జాతీయ సదస్సును నిర్వహించాయి. ఈ సందర్భంగా అచార్య యార్లగడ్డ ప్రసంగిస్తూ విదేశాలలోని హిందీ విద్యార్ధుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, ఇందుకు అయా దేశాలతోని విశ్వ హిందీ పరిషత్తు ఇప్పటికే కార్యాచరణ సిద్దం చేసిందని వివరించారు. అదే క్రమంలో విదేశాలలోని హిందీ అద్యాపకులు కూడా పలు సమస్యలు ఎదుర్కుంటున్నారని, భారతీయ భాషగా హిందీ ఔన్నత్యాన్ని కాపాడేందుకు వీరు చేస్తున్న కృషి ఎంచదగినదన్నారు. సున్నా డిగ్రీల వాతావరణంలో సైతం అచ్చతెలుగు పంచె కట్టులో గురజాడ తెలుగు కవితల హిందీ అనువాదం చేస్తూ, సందర్చొచితంగా హిందీ కవుల కవితలను ప్రస్తావిస్తూ సాగిన అచార్య యార్లగడ్డ ప్రసంగం ఆహాతులను ఆకర్షించింది. కార్యక్రమానికి హాజరైన వివిధ దేశాల ప్రతినిధులు యార్లగడ్డతో ఛాయాచిత్రాలు దిగేందుకు పోటీ పడుతూ తమ గౌరవాన్ని చాటు కున్నారు.