- దూకుడుగా ముందుకు వెళ్లాలి
- టీడీపీ, జనసేన తో దోస్తీ పై స్పష్టం చేయని బీజేపీ
- అసెంబ్లీ సీట్ల కోసం ఎవరితో చర్చలు జరుపలేదు: బీజేపీ
ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ దూకుడుగా ముందుకు పోవాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వంనికి కేంద్ర బీజేపీ పెద్దలు సూచిచారు. ఏపీ, కర్ణాటక సరిహద్దుల్లో హిందూపురం సమీపంలో ఈనెల 15న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటిస్తున్నారు. ప్రైవేటు కార్యక్రమానికి మోదీ హాజరువుతున్నారు. ఈ కార్యక్రమానికి ఏపీ బీజేపీ నేతలతో పాటు రాయలసీమ ప్రాంతానికి చెందిన బీజేపీ నేతలు పాల్గొంటున్నారు. రానున్న ఎన్నికలకు ఏపీ బీజేపీని సిద్ధం చేయాలని కేంద్ర బీజేపీ నేతలు దిశా నిర్దేశం చేయనున్నారు. ఇన్నాళ్లు పొత్తులపై చర్చలు జరుగుతాయాని ప్రకటలు తప్పా ఇరువైపుల నేతలు కూర్చున్న దాఖలాలు లేవు. ఐతే టీడీపీ, జనసేన పార్టీలతో ప్రాథమిక చర్చలు జరగలేదని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఎన్నికల సమయం ముచ్చుకొస్తునా పొత్తులపై సమాచారం ఏమీ లేదని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఎన్నికల పై టీడీపీ, జనసేన పార్టీల అధినేతలు ఇప్పటికే పలుదపాలుగా ప్రాథమిక చర్చలు జరిపారని ఆయా పార్టీ నేతలు లీకులు ఇచ్చారు. ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై ఇటు టీడీపీ అటు జనసేనతో బీజేపీ ముందుకు వెళ్లడంలేదు. జనసేనకు ఎన్ని అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లు ఇస్తుందో టీడీపీ చెప్పడంలేదు. పొత్తులపై స్పష్టమైన ప్రకటన రాకపోవడం టీడీపీ, జనసేన కేడర్ అయోమయంలో వుంది. జనసేనకు కనీసం 40 నుంచి 60 అసెంబ్లీ, 5 పార్లమెంట్ స్థానాలు ఇస్తే పోటీ మంచిగా ఉంటుందని సీనియర్ నేత హరిరామ జోగయ్య పవన్ కళ్యాణ్ కు బహిరంగ లేఖ రాశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మధ్య చర్చల అంశం బయటికి రాలేదు. ఏపీ లో 175 స్థానాలకు పోటీ చేయాలన్నదే బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నెల22న అయోధ్య లో శ్రీరామిని ప్రాణ ప్రతిష్ట తర్వాత బీజేపీ ఎన్నికల శంఖారావం మోగించునున్నది. ఏపీలో ఈనెల 25తేదీ నాటికి పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జిల్లా కలెక్టర్, ఎస్పీ లకు ఆదేశాలు ఇచ్చారు.
Also read: వివాదగ్రస్థమైన చంద్రబాబునాయుడు ఆళ్లగడ్డ సభ