- మొన్న తిరువూరు నేడు ఆళ్లగడ్డలో రగడ
- నేతల మీటింగా, పబ్లిక్ మీటింగా?
- అభ్యర్థి ఎవరో చెప్పలేదు, పార్లమెంట్ 7 అసెంబ్లీ నియోజకవర్గాలనుంచి పోటాపోటీగా జనం తరలింపు
- అయోమయం లో పార్టీ నేతలు
ఏపీలో రాబోవు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం అవుతున్న టీడీపీ వివాదలకు దారితీస్తోంది. మొన్న తిరువూరు, నేడు ఆళ్లగడ్డ లో జరిగిన బహిరంగ సమావేశాలు వివాదాస్పదమైనాయి. మంగళవారం ఆళ్లగడ్డలో జరిగిన టీడీపీ బహిరంగ సభ అభ్యర్థుల బలప్రదర్శనకు దారితీసింది. అభ్యర్థులు తమకు టికెట్లు దక్కించుకోవడానికి తమ అనుచరగణాన్ని తరలించారు. నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు వున్నాయి. అన్ని అసెంబ్లీ నియోజక వర్గాల నుంచి పోటీ చేయడానికి ఆశవాహులు పోటాపోటీగా బలప్రదర్శన చేశారు. ఐతే మీటింగ్ ఏర్పాటు చేసిన ఆళ్లగడ్డలో టీడీపీ నుంచి ఎవర్ని పోటీకి దించుతారో చంద్రబాబు చెప్పలేదు. అభ్యర్థి చెప్పకుండా బహిరంగ సభ ఏర్పాటు చేయడం ఏమిటి అని టీడీపీ కేడర్ చంద్రబాబును నిలదీస్తున్నారు.
అభ్యర్థులను ప్రకటించకుండా సభలు
ఇలాంటి మీటింగ్ లు పెట్టుకోవడం దండగ అంటూ ఏకంగా నేతలే కన్నెర్ర చేశారు.
అదిలోనే చంద్రబాబు మీటింగ్ లు ఇలాంటి వివాదాలకు దారితిస్తే రాబోయే రోజుల్లో పరిస్థితి ఏమిటి అని కేడర్ ఆందోళన చెందుతోంది. ఆళ్లగడ్డలో టీడీపీ ఎమ్మెల్యే, మంత్రిగా పనిచేసిన భూమా అఖిలప్రియకు 2024లో అసెంబ్లీ టికెట్ ఇస్తారా లేదా అన్న ప్రశ్నకు చంద్రబాబు తెరదించలేదు. అభ్యర్థి ఎవరో చెప్పకుండా బహిరంగ సభలు పెట్టడం వివాదాలకు దారితీసిందని కేడర్ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఎన్నికల్లో టీడీపీ మిత్ర పక్షాలగా చెప్పుకుంటున్న జనసేన, బీజేపీ పార్టీలు సైతం ఆళ్లగడ్డ అసెంబ్లీ టికెట్ ను ఆశిస్తున్నారు. ఆళ్లగడ్డలో గ్రూప్ రాజకీయాలు ఎక్కువ గా నడుస్తాయి. ఇక్కడ టీడీపీ అభ్యర్థి భూమా అఖిల ప్రియా పోటీ చేస్తే బీజేపీ, జనసేన వైపు నుంచి మద్దత్తు వస్తుందా అన్నది పార్టీ నేతలు చెప్పలేమని అంటున్నారు. ఆళ్లగడ్డ నుంచి బీజేపీ అభ్యర్థిగా భూమా కిషోర్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. జనసేన పార్టీ నుంచి ఇరిగేల రాంపుల్లారెడ్డి తనకు టికెట్ ఖాయమని చెబుతున్నారు. నంద్యాల పార్లమెంట్ లో ఆళ్లగడ్డ. బనగానపల్లె, పాణ్యం, శ్రీశైలం, డోన్, నంది కొట్కూరు నియోజక వర్గాలు వున్నాయి. ప్రతి అసెంబ్లీ నియోజక వర్గం నుంచి టీడీపీ, జనసేన ఆళ్లగడ్డ సభకు బహిరంగంగా, పరోక్షంగా బీజేపీ నేతలు మీటింగ్ కు మద్దత్తు పలికారు. చంద్రబాబు ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభలు వివాదలకు దారితీస్తున్నాయి. అభ్యర్థులు ప్రకటించిన తర్వాత చంద్రబాబు పర్యటనలు చేపడితేనే పార్టీ గెలుపునకు సాంకేతలు వస్తాయని కేడర్ సూచిస్తోంది.