శ్రీమాన్ కె ఇ నరసింహన్ ప్రవచనం
పుత్రుడు పుట్టడం అంటే అందరికి ఆనందమే కాని ఆ బిడ్డకు జన్మించడం అంటే ఇంత కష్టమో తెలిసా? గర్భవాసం ఎంత నరకమో, గర్భ నరకమో? పిండానికి పురుగులలో బతుకుతాడు. ప్రతిజన్మలో ఎంతో భయంకరం. 84 లక్షల రీతిలో పుట్టుకోవాలంటే అన్ని కష్టాలు కదా. బాల్యదుఃఖం తరువాత, కాని ముందు ఉమ్మనీరు మింగుతూ కష్టపడుతూ ఉంటాడు. ఒక్కో జన్మలో పది నెలల దాకా అనేకానేక అవయవాలు తయారు చేసే దాకా తనకు తెలిసిన బాధలను భరించడానికే అసలు కష్టం అని అర్థం కాదు. పుడుతూ గిడుతూ నడుస్తూనే ఉంటుంది. జన్మమరణాలు మామూలే అయిపోతుంది. ఇంక ఈ గర్భనరకం మళ్లీ రాకవద్దు పూజలు చేసుకుంటాను. సాంఖ్యయోగాన్ని మంచి ఆచార్యంతో పునర్జన్మంలేకుండా తపస్సు చేసుకుని మోక్షం పొందుకుంటాననుకుంటాడు ఆ బిడ్డ. కాని పుట్టిన తరువాత ఏమీ జ్ఞాపకం రాదు. శఠం అనే మాయతో ఉండడం వల్ల గుర్తు రాదు. కనుక అన్నీ మోక్షానికి వచ్చే పనులసలే చేయడు.
మామూలు మనిషికి అనేకానేక జన్మల్లో ఈ కష్టాలన్నీ తప్పదు. కాని ఆ తిప్పలు భగవంతుడికి మళ్లీ పుట్టాల్సిన గతి ఎందుకు? అని అనుకుంటే దేవకీదేవి తల్లికావడానికి ఎందుకు కష్టపడాలి? ఆ విధంగా పుట్టిన శ్రీ కృష్ణుడు ఈ మానవులందరు రక్షించేందుకోసం అంత కష్టం పడుతున్నాడే. మీ వలె పుట్టడానికి పుట్టి, భగవంతుడే పుట్టి మనకోసమే మాత్రమే ఆశ్రయించుకోవడానికి కదా. ఈ క్షీరసాగరం నుంచి సంసార సాగరం లోకి వస్తున్నాడే.
Also read: తిరుమల జీయర్ మఠంలో మంగళాశాసన పాశురం
రామచంద్రుడై పుట్టడానికి కూడా ఇంతదారుణమైన గర్భనరకం భరిస్తున్నాడే, కనీసం శ్రీరాముడు పుట్టిన తరువాత పెళ్లి తరువాత కొంతకాలం దాకా హాయిగా ఉన్నారు. కాని శ్రీ కృష్ణుడు పుట్టినా పుట్టగానే తల్లిని వదిలి వెళ్లిపోవడానికి తప్పలేదు కదా. శంఖు చక్రాలతో చతుర్భుజాలతో జన్మించిన శ్రీకృష్ణుడు అతని గుర్తించి, కంసుడు చంపుతాడనే భయంతో నాలుగు చేతులను ఉపసంహరించుకుని వెంటనే కాళరాత్రి అయినా వెళ్లిపోతాడు. అంటే పుట్టిన పుట్టగానే పసికందునైనా చూడకుండానే రాక్షసులెంతమందో దాడిచేయడం మొదలైంది. యశోదముందైనా గండాలు లేకుండా ఉంటాయా అంటే అదీ లేదు. దాక్కొని దాక్కొని పెరిగిపోవలసి వస్తున్నది. నామకరణం కూడా గతి లేదు. భయపడుతూ దాక్కొని గర్గమహర్షికి రహస్యంగా పేరు పెట్టుచేసుకున్నారు. అదీ గొట్టం లో ఎవరికీ కనపడకుండా నామ కరణం చేసుకున్నారు. పంపిన రాక్షసులను పంపిన పంపినట్టు చంపి పైకి పంపిస్తున్నాడు.
Also read: నరసింహుడికే సర్వవ్యాపకత్యం
మారీచుడి బాణం దెబ్బ చావుదెబ్బ భరించి బతికిపోయాడు, మరొ సారి భార్య ముందే రాముని ప్రాణానికే పైకొచ్చింది. నయానా భయానా అంటారు కదా, మారీచుడు భయంతో బాగైపోయాడు. మహర్షివలె తయారయ్యాడు. కాని రావణుడ చేతిలోనే చావడానికి సిధ్ధమయ్యాడు. నీ చేతిలో చావడం కన్న రాముని చావడం నయం కదా అని జింక రూపంతో మరణించి పోయాడు. మిగతా రాక్షసులు శ్రీకృష్ణ బాల్యంలోనే అనేకానేక రాక్షసులను చంపి పంపించాడు. ఎందరిని పంపినా, పైకే కాని మధురకు వచ్చేవాడు లేడు. చివరకు శ్రీకృష్ణుడినే వెతుక్కొని కంసుడు మృత్యువు చేరిపోయాడు.
ఇందరైనా బతుకుతూ తననే చంపుతాడా అన్నట్టు కంసుడు భయపడ్డాడు. చివరకు కంసుడు కేవలం మృత్యుభయంతో చచ్చిపోతాడు. అందువల్లనే మనసులో మంట పెరిగి నిప్పుతో కాలిపోయాడు. రామయణంలో హనుమ నిప్పుతో లంకాదహనం చేసినా, నిజానికి సీత ఆమె క్రోధాగ్నికి, శోకాగ్నికి కాలిరాలిపోయాడు. కంసుడు కేవలం భయాగ్నికి పోయాడు.
అంటూ గోపికలు శ్రీకృష్ణా నీకోసంమే మీరు పుట్టినవారు. మాకోసం జన్మకష్టాలు భరించి అనుగ్రహిస్తున్నారు. ఇంకా మాకేమీ అవసరం లేదు. పఱై అనే కావలం ఒక సాకు మాత్రమే గాని మాకు కావలసింది నీ అనుగ్రహం మాత్రమే గాని ఏ కోరికలు లేవు అని గోదాదేవి నాయకత్వంలో టిటిడి వక్త, కె ఇ లక్ష్మీనరసింహన్ అని ఇద్దరు తిరుమల శ్రీశ్రీశ్రీ జీయర్ స్వాములు నిర్వహించిన తిరుప్పావై ఈ 25వ విశేషమైన పాశురం ప్రవచనంలో శ్రీకృష్ణ జన్మలో రహస్యాన్ని అర్థం చేయించారు. (తిరుమల జీయర్ మఠం లో 9.1.2024న https://www.youtube.com/watch?v=fQDz3RJZbzQ అని అర్ధం చేసుకోవచ్చు)
Also read: నాకు మరేదారీ లేదు అంటేనే శరణాగతి