వోలేటి దివాకర్
తెలుగుదేశం, జనసేన మధ్య పొత్తు కుదిరి, ఉమ్మడి కార్యాచరణతో పనిచేస్తున్న తరుణంలో ఇద్దరు నేతలు సీటు నాదంటే నాదంటూ పవరికి వారు పన్నికల ప్రచారాన్ని నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. రాజమహేంద్రవరం రూరల్‌లో ఈ పరిస్థితి నెలకొంది. ఒకవైపు సీనియర్ పమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, మరోవైపు జనసేన జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ రూరల్‌లో విడివిడిగా ప్రచారం చేసుకుంటున్నారు. ఈనేపథ్యంలో రూరల్ సీటుపై జనసేన, తెలుగుదేశం పార్టీల మధ్య పేచీ నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పేచీ చివరకు ఎటుదారి తీస్తుందోనన్న ఆందోళన ఇరుపార్టీల నాయకులు, కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది.
Also read: రూరల్ సీటు నాదే…కాదంటారా?!
సీనియర్ పమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సీటు తనదేనన్న ధీమాతో ఆయన ఇంటింటి ప్రచారం చేయడంతో పాటు, బూత్‌స్థాయిలో పార్టీ పటిష్టతకు కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రూరల్ సీటు తనదేనని ధీమా వ్యక్తం చేశారు. సీటు తనకు రాదంటావా అంటూ ఒక విలేఖరిని ఎదురు ప్రశ్నించారు. ఎంపీగా పోటీ చేస్తారన్న ప్రచారంపై స్పందిస్తూ డిల్లీ వెళ్లి పకోడీ తినాలా అంటూ సెటైర్ వేశారు. ఈసారి గెలిస్తే, అదే సమయంలో టిడిపి కూటమి అధికారంలోకి వస్తే గోరంట్లకు మంత్రి పదవి ఖాయంగా చెబుతున్నారు.
పవన్ పట్టుపడతారా?
మరోవైపు సీటు గత ఎన్నికల్లో జనసేన జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ రూరల్ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. జనసేనలో ఆయన కీలక నాయకుడిగా ఉన్నారు. టిడిపి, జనసేన పొత్తులో భాగంగా రూరల్ సీటును జనసేనకు ఖరారు చేస్తారన్న ప్రచారం బలంగా ఉంది. రూరల్ సీటు కోసం జనసేనాని పవన్ కల్యాణ్ కూడా గట్టిగా పట్టుబట్టే అవకాశాలు ఉన్నాయన్న వాదన వినిపిస్తోంది. దుర్గేష్ కూడా సీటు తనదేనన్న ధీమాతో ఉన్నారు. అయితే ఇటీవల ఆయన సతీమణి తీవ్ర అనారోగ్యానికి గురై, హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని రాజకీయ ప్రత్యర్థులు దుర్గేష్ వచ్చే పన్నికల్లో పోటీ చేయరని, ఆయన ఆర్థిక పరిస్థితి కూడా ఇందుకు సహకరించదని ప్రచారం చేస్తున్నారు. అలాగే ఇటీవల పవన్ కల్యాణ్, టిడిపి నేతల మధ్య సీట్ల సర్దుబాటుపై జరిగిన భేటీలో దుర్గేష్‌ను పార్లమెంటుకు పోటీ చేయాలన్న ఒత్తిళ్లు కూడా వచ్చినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో తన పోటీపై జరుగుతున్న ప్రచారాన్ని గుర్తించిన దుర్గేష్ గత కొద్దిరోజులుగా రూరల్ నియోజకవర్గంలో తన అనుచరులతో విస్తృతంగా ప్రచారాన్ని చేయిస్తున్నారు. దీన్ని బట్టి దుర్గేష్ రూరల్‌లో పోటీకి సిద్ధంగా ఉన్నట్లు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. తాజాగా విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ రూరల్ సీటు తనదేనని స్పష్టం చేశారు. తనను ఎమ్మెల్యేగా చూడాలని సన్నిహితులు, అభిమానులు కోరుకుంటున్నట్లు చెప్పారు. పండుగ తర్వాత టీడీపీ, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు ఒక కొలిక్కి వస్తుందన్నారు.
Also read: కమ్మవారంతా కలిస్తే….?
గోరంట్ల సీటు గోవిందేనా?
రూరల్‌లో పోటీపై దుర్గేష్ స్పష్టతనిచ్చిన నేపథ్యంలో ఆరుసార్లు పమ్మెల్యేగా గెలిచిన గోరంట్ల రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారనుంది. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు వెన్నుపోటు పపిసోడ్ సమయంలో టిడిపి అధినేత చంద్రబాబునాయుడి వ్యతిరేక వర్గంలో ఉన్న గోరంట్ల పట్ల బాబుకు కూడా పెద్దగా సానుకూలత లేదన్నది పార్టీ వర్గాల విశ్లేషణ. ఈ నేపథ్యంలో గోరంట్ల సీటును వదులుకునేందుకు కూడా బాబు వెనుకాడరని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో గోరంట్లకు సీటు బదిలీ కానీ, అవసరమైతే రిక్తహస్తం కానీ తప్పకపోవచ్చని విశ్లేషిస్తున్నారు.
Also read: త్యాగులు ఎవరు ?…. తిరుగుబాటుదారులెవరు?!