Sunday, December 22, 2024

టొటాలిటీ ఆఫ్ లైఫ్

భగవంతుడా!

నువు లేవని నాకు తెలుసు. నిన్ను చంపేస్తారనీ తెలుసు. నీ జ్ఞాపకాల్ని వెదుకుతూ గుళ్ళూ, గోపురాలూ, మజీదులూ, మందిరాలూ, చర్చిలూ, సమాధులూ గాలిస్తున్నాం.

విశ్వం ఘోష నీ ఆర్తనాదమేమో మాకేం తెలుసు. నువు చెప్పలేవు.

మా హృదయంతో గ్రహించాలని చూస్తాం. అలా నువు మాలో పాతుకుపోయావు. భౌతికంగా లేని హృదయంలో నిన్నుఅనూభూతి చెందుతున్నాం. అసలు నువ్వే లేనప్పుడు మాకు హృదయం ఉంటం ఏమిటి?

మా బాధలు, గాధలు, మా ఆదేశాలూ, ఆనందాలూ, స్వప్నాలూ, సంతోషాలూ, దుఃఖాలూ కల్పించిందే హృదయం. నువు లేవు కనుక నీకు చెప్పుకోవడానికేమీ లేదు. అందుచేత నా హృదయానికి చెప్పుకుంటాను.

హృదయమా?

నా పుట్టుక నా చేతిలో లేదు. నా బ్రతుకు నా చేతుల్లో లేదు. నా తల్లిదండ్రుల ఆవేశంలోంచే నేను జనించాను. ఆ ఆవేశం భౌతకమా? పండితులు తల పట్టుకుంటున్నారు. పామరులు జీవితాన్ని అనుభవిస్తున్నారు.

నేను పండితుణ్ణి కాదు.

పామరుణ్ణీ కాదు

గడియారంలో గంటని

అటు పండితుణ్ణీ కాదు

ఇటు పామరుణ్ణీ కాదు

క్షణం క్షణం క్షణంలో సగం అనుక్షణం నిరంతరానికి

అనంతరానికి నేనున్నానని నాకు తెల్సు.

నా పుట్టుక నా చేతిలో లేదు. అమ్మానాన్నల చేతిలో లేదు. వాళ్ళ ఆవేశ ఫలితాన్ని. ఒట్టి మాంసం ముద్దని.

నా జీవితం నా చేతిలో లేదు.

నేను ఎంత అందంగా బతకాలన్నా, నా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అందంగా మార్చడం కూడా నా చేతిలో లేదు. ఐ యామ్ హంటెడ్. హంటర్స్ ఆర్ బ్లస్టడ్. అందుచేతే నా హృదయం చెబుతోంది

భగవంతుడా నిన్ను ఒక్కసారి చంపేస్తే సరిపోదు

హంటర్స్ ని నువ్వు బ్లస్ట్ చేసినంత కాలం నిన్ను చంపుతూనే ఉండాలి.

అయితే నిన్ను చంపడానికి నాకూ ఒక ఆయుధం ఉంది.

తుపాకులతో నువ్వ చావవని నాకు తెల్సు

కత్తులతో నిన్ను పొడవలేనని తెల్సు. పరశురాముడి గొడ్డలితో నిన్ను నరకలేనని తెల్సు. శూన్యానివి కదా? అందుచేత నిన్ను చంపాలంటే నన్ను నేను చంపుకోవాలి. నువు నాకు జీవితాన్నిచ్చావనుకుంటున్నావు. నా పుట్టుకకీ, నా చావుకీ నువు కర్తవి కాదు. నా చావు నా చేతిలో ఉంది. నన్ను ధిక్కరించడానికైనా నా చావు నేను చావాలనుంది.

నా చావు నే చస్తే….

అది మానవుడి ఓటమి

శూన్యమా నీకు రెక్కలు మొలుస్తాయి

నా చావు నా చేతుల్లో ఉన్నా, నిన్ను మళ్ళీ మళ్ళీ చంపాలంటే మనిషి ఎప్పటికైనా మృత్యువుని జయించాలి.

నా పుట్టుక ఎలాగైనా నా చేతుల్లో లేదు.  నేను స్త్రీగా పుట్టాలో, పురుషుడుగా పుట్టాలో, అర్ధనారీగా పుట్టాలో, అర్ధనారీశ్వరుడుగా పుట్టాలో నా చేతిలో లేదు. అది  నీ లిఖితం. అనుకుంటే నువు మళ్ళీ పురుడు పోసుకుంటావు.

నా జీవితం అసంపూర్ణం కాకుండా ఉండాలంటే శాస్త్రాన్ని ఆశ్రయించి నేను స్త్రీగా, పురుషుడిగా, పురుషస్త్రీగానూ, స్త్రీపురుషుడిగానూ మారగలుగుతాను.

మేము మా జీవితాన్ని సంపూర్ణంగా జీవించాలంటే లైంగికతని మార్చుకుంటాం. అప్పుడే మా జీవితం మేం జీవిస్తాం. అందంగా, అర్థవంతంగా  నీ ప్రమేయమూ, నీ దాష్టీకమూ లేకుండా స్వేచ్ఛగా బతుకుతాము.

Krishna Rao Nandigam
Krishna Rao Nandigam
నందిగం కృష్ణారావు ప్రముఖ నవలా రచయిత, కథకుడు. ప్రఖ్యాత న్యాయవాది. మొబైల్: 93930 33345

Related Articles

1 COMMENT

  1. ఆలోచనాత్మకంగా ఉంది. దేవుడే మానవుడి సృష్టి అయినపుడు ఇక మానవుడి గురించి ఎవర్ని వేడుకోవాలి?
    మళ్ళీ మళ్ళీ ఆలోచించేట్లు , మనల్ని మనం తరచి చూసుకునేటట్లు ఉంది ఈ కథనం.
    వాస్తవం చెప్పినపుడు, దాన్ని మరింత హేతుబద్ధంగా చెప్పినపుడు దేవుడైనా విని తీరవలసిందే !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles