జర్నీ- 3
నాలుగో తరం వాళ్ళు జిప్సీ తోలేస్తున్నారు అంటే నా పిల్లలు పద్మిని, సోం రాజ్, రుచిక నడుపుతున్నారు. ఓ సారి ఏమయ్యిందో తెలుసా …?
‘చెపుతే గా తెలిసేది’ అన్నాడు రామన్.
‘యేహే, వూకో రా బై. సందు దొరికితే చాలు దూరుతావు, నీ కాల్మొక్తా’ అన్నాడు
బెనర్జీ. నీ కాల్మొక్తా అన్న యక్సెంట్ కూ అందరూ పడీ పడీ కడుపు పట్టుకోని నవ్వారు,
‘‘ఇప్పుడు నాకు ధైర్యం వచ్చింది, వినండ్రి. రుచికా, సోమ్ రాజ్, రచన, రచన స్నేహితులు కలిసి ఈ జిప్సీ లోనే ఖండాల వెళ్ళారు. ఏం అధ్భుతమైన అనుభవం అది. ఫుల్లుగా ఎంజాయ్ చేశారు. నేను పని ఉండి సిటీ లోపలికి వెళ్ళాను. నాకు అక్కడే సాయంత్రం అయ్యింది. రచన వాళ్ళకు వేరే అదే వారికి నచ్చే బండి ఏర్పాటు చేసి జిప్సీ తీసుకోని నేను వెళ్ళిపోయాను. అయితే, వాళ్లు ఇష్టపడిన బండి వాళ్ళకు నచ్చలేదట, ఒకటే గోల. జిప్సీనే కావాలి అంటూ రుచిక ఏడుపు. రుచిక వయసు అప్పుడు 15/16 ఉండవచ్చు. యామై కరెక్ట్ రచన. రచనకు పిల్లలంటే చాలా చాలా ఇష్టం. అందుకే గబగబ ముగ్గురిని ఇచ్చింది. జీవితాన్ని రచించి నా చేతిలో పెట్టింది. కొత్త జీవితం రుచులను పరిచయం చేసింది, ఆ రుచులను బాగా జీవితానికి సరిపడినంతగా ఆస్వాదించాను…’’
‘‘ఏహే, రుచిక ఏడ్చింది. ఆ తరువాత ఏమయ్యింది?’’ అని అడిగాడు రామన్,
‘‘నేను పని ముగించుకోని తిరిగి వచ్చేసరికి రాత్రి 10 అయిపోయింది, కాటేజీ బయటే రుచిక ఉంది. లోపలికి రమ్మని ఎంత బ్రతిమిలాడినా లోపలికి పోలేదు అట, దాని అన్న సోమ్ రాజ్ దానికి కాపలాగా బయటే ఉన్నాడు. వాడికి ఎంత వయసు అంటే దీనికన్నా పన్నెండు నెలలే తేడా. నన్ను చూసి జిప్సీకి ఎదురుగా రుచిక పరుగెత్తుకుంటూ వస్తోంది, సోము ఆగవే ఆగవే అంటూ వాడు దాని వెనకాల పరుగెత్తుకుంటూ వస్తున్నాడు. నేను నా బండిని ఆపేశాను. రుచిక ఒక్క గెంతు గెంతి నా పక్కన కూర్చుంది, నా మెళ్లో రెండు చేతులు వేసి వెక్కి వెక్కి ఏడుస్తుంది. సోము బండ్లో వెనకాల సెటిల్ అయ్యాడు. ఎందుకు ఏడుస్తున్నావు రుచిక అని అడుగుతే అన్న అంటుంది. సోము ఏం చేసావు రా అంటే , ఏం చేయలేదు అని వాడు. ‘‘చెప్పు తల్లీ నేను ఉన్నాను నీ డాడీని, ఒక్కోడి మక్కలు విరగ్గొడుతాను, మీ అన్న సోము నిన్ను ఏమైన అంటే, వాడిని కూడా వదిలి పెట్టను’’ అంటే కూడా, మళ్లీ గట్టిగా వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉంది. కొంత సేపు ఏడ్వనిచ్చాను, ఇప్పుడు చెప్పు రుచిక నీ ఏడుపుకు కారణం ఏంటో అంటే, మళ్లీ అన్న అన్నది , నేను ఒక్క క్షణం ఆలోచించాను, విషయం చెప్పమంటే అన్న అంటుంది ఎందుకు అని, వెంటనే స్ఫురించింది అన్న ఉన్నాడు అని చెపుతుంది అని. వెంటనే సోమును కాటేజీ దగ్గిర దింపి రుచిక నేను కొంత దూరం వెళ్ళాక జిప్సీని ఆపేసాను. ఇప్పుడు చెప్పు తల్లీ ఎందుకు ఏడుస్తున్నావు, అంటే మళ్లీ ఏడుస్తూనే ఉంది. నీళ్ళు ఇచ్చాను తాగమని. తాగింది. జిప్సీ లో ఫ్రిజ్ కూడా ఉంటది, రుకాకు ఇష్టమైన ఐస్ క్రీమ్ కొని అందులో పెట్టాను, ఐస్ క్రీమ్ తీసి ఇచ్చాను. ఇప్పుడు వద్దు బాబా అన్నది. ఇది ఒక్కతే నన్ను బాబా అంటది. మిగతా ఇద్దరూ పప్పా అంటారు. చెప్పు బేట ఎందుకు ఏడ్చావు అని అడుగుతూనే మళ్ళీ ఏడుపు మొదలు పెట్టింది.
Also read: జర్నీ -1
‘‘నీవు ఏడువ కుండా విషయం చెపితే, ఏంత రిస్కు అయినా నేను చేస్తాను అని నీకు తెలుసుగా, మీ స్కూల్ టీచర్ ని కొట్టలేదా? పోలీస్ కేసు అయితే కూడా టీచర్ తప్పు చేశాడు అని కోర్టు చెప్పింది కదా. నా మీద నమ్మకం లేదా?
‘‘బాబా నీకు ఎలా చెప్పాలో అర్ధం కావట్లేదు. అది గుర్తుకు వచ్చి భయం వేసి ఏడుపు వస్తోంది బాబా అంటూ మళ్ళీ ఏడుస్తోంది.
పోని అమ్మను పిలుద్దామా, అమ్మకు చేపుతావా?
కాదు బాబా అమ్మకు చెపుతే, పాపం అమ్మ బాధపడతదేమో, అమ్మ స్నేహితురాలి హస్బెండ్ చెడ్డోడు బాబా, అమ్మకు ఎలా చెప్పాలో తెలియక నీకోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఆ అంకుల్ చాలా చెడ్డోడు బాబా. నేను కార్ లో అంకుల్ పక్కన కూర్చున్న బాబా, నా పై చేతులు వేసి బాడి మొత్తాన్ని తాకుతూ పొట్టమీద కూడా చేతి వేసాడు. మమ్మి ఆంటి ముచ్చట్లు పెట్టారు. నేను చేతులు బండి కుదుపులకి తగులుతున్నాయి అని భావించాను. పొట్టమీద కావాలని వేసినట్లు ఫీల్ అయ్యాను, వెంటనే కార్ ను ఆపించి సోమన్న సీట్లోకి మారాను, సోమన్న నా సీట్లోకి మారాడు.
‘‘ఏం అంకుల్, కార్ ఎక్కుతునే పక్కవాళ్ళ మీద పడి నిడురపోతూనే ఉంటారా లేక మీద పడి నిదుర పోతున్నట్లు నటిస్తారా? అని సోమన్న అంకుల్ ని అడిగేశాడు. అంకుల్ జవాబు ఇవ్వలేదు, కానీ ఆంటీ చెప్పింది. అవును బాబు కార్ ఎక్కుతూనే పక్కోళ్ళ మీద పడి నిదుర పోతూనే ఉంటాడు అన్నది.
‘‘నాకు ఏదో తేడా కనిపిస్తుంది ఆంటీ’’ అని అన్నాడు సోమన్న
‘‘అవును, నీకు అన్నీ తేడానే కనిపిస్తాయి, ముందు నోరు మూసుకొని, కళ్ళతో అన్ని చూడు’’ ఆని అమ్మ అన్నను కసిరింది.
‘‘నేను ఫొటోస్ తీసుకుంటూ ఉంటే మళ్ళీ దగ్గిరకు వచ్చి ఇలా తీయాలి, అలా తీయాలి అంటూ నా చేతి వేళ్ళను నలిపేసాడు, ఒక్కటి ఇద్దామంటే భయం వేసింది. నీ ఎద మీది అందాలను ఫోటో తీసి సోషల్ మీడియాలో పెడితే ఎన్ని కామెంట్స్ వస్తాయో చూద్దామా అని చాలా రోతగా మాట్లాడాడు. అందుకే జిప్సీ ఇప్పుడే కావాలి అని మమ్మీకి చెప్పాను. జిప్సీ లోనే ఖండాల మొత్తం తిరుగుతాను అని చెప్పేసి కార్ లో వెళ్లి కూర్చున్నాను.
‘‘అమ్మకు చెప్పి ఉంటే ఈ పాటికే, ఆ రాస్కెల్ ను, ఆ గాడిదను తన్ని తగుల పెట్టేసి ఉండేది. మీ అమ్మ చాలా బోల్డ్ రా కన్నా, కాక పోతే అర్థం చేపించాలి’’ అన్నాడు.
Also read: జిప్సీ కారు, నాలుగో తరం!
(ఇంకా ఉంది)
… అజీబ
#9440430263