(డా. భదంత ఆనంద కౌసల్యాయన్)
డా. భదంత ఆనంద కౌసల్యా యన్ వ్యాస సంపుటిని పాతి కేళ్ళ క్రితం 1997లో బౌద్ధ మేధావి డి. సి. ఆహిర్ సంపాదకత్వంలో Essays On Buddhism పేరుతో నాగపూర్ లోని బుద్ధభూమి ప్రకాశన్ వారు ప్రచురించారు. పది విలువైన వ్యాసాలు గల ఈ పుస్తకంలో అనుబంధంగా ‘యాదె బాబా నా హోతే’ అనే ఆనంద కౌసల్యాయన్ హిందీ వ్యాసానికి భిక్కు చంద్రబోధి చేసిన ఆంగ్లానువాదం ‘Dr. Ambedkar, The Liberator’ ఇచ్చారు!
అప్పటికే దీనిని న్యాయవాది బాపూరావ్ పాఖ్ఖడే పరిష్కరించారని చెబుతూ, డా. బి. ఆర్. శతజయంతి సందర్భంగా థాయ్‌లాండ్లోని బ్యాంకాక్ లో 1991, ఏప్రిల్ 14 న జరిగిన అంతర్జాతీయ బౌద్ధ సమ్మేళనంలో ఎస్. శివ రక్సా సంపాదకుడి గా వెలువరించిన సావనీర్ లో ప్రచురించినట్లు ఈ పుస్తకానికి రాసిన ముందుమాటలో ఆహిర్ పేర్కొంటూ వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు !
ఆ చిన్ని అనువాదాన్ని తెలుగు చేసి సాఫ్ట్ కాపీగా ఇలా తీసుకు రావడం జరుగుతోంది. బాబా సాహెబ్ అంబేద్కర్, భదంత ఆనంద కౌసల్యాయన్ ల కృషి పై ఉన్న గౌరవం,ప్రత్యామ్నాయ సాంస్కృతిక పద్ధతులను అధ్యయనం చేసే క్రమంలో బౌద్ధం పట్ల నెలకొన్న ప్రేమ మాత్రమే ఇందుకు కారణం. ఆసక్తి ఉన్న మిత్రుల కోసం సాఫ్ట్ కాపీ పంపు తున్నాను. విమర్శలకు ఆహ్వానం!
(అప్పటికప్పుడు అనుకుని ఈరోజే తేవాలని చేసిన హడావుడి ప్రయత్నం కాన అక్షరదోషాలు, అన్వయ లోపాలు ఉండవచ్చు. వాటికి పూర్తి బాధ్యత నాదే. ఈసరికే ఇది తెలుగులోకి వచ్చిందేమో తెలీదు. ఒకవేళ వచ్చినా ఈ చిన్నపాటి ప్రయత్నం మరోసారి చేయడం వల్ల నష్టం లేదనే వైఖరే దీనికి కారణం. సౌలభ్యం ఉన్న మిత్రులు మా ప్రయత్నాలకు స్వచ్ఛం దంగా సహకారం అందించడానికి ముందుకు వస్తే సంతోషం !)
– గౌరవ్