Thursday, January 2, 2025

తెలంగాణలో పోలింగ్ నంబర్ 30న

  • డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు
  • రాజస్థాన్ లో నవంబర్ 23, మధ్యప్రదేశ్ లో నవంబర్ 17, ఛత్తీస్ గఢ్ లో 7,17 తేదీలలో, మిజోరంలో నవంబర్ 7న పోలింగ్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పోలింగ్ నవంబర్ 30వ తేదీన జరగనున్నది. ఫలితాలు డిసెంబర్ 3న వెల్లడికానున్నాయి. ఎన్నికల ప్రధానాధికారి రాజీవ్ కుమార్ సోమవారం  ఉదయం మీడియాతో మాట్లాడుతూ మీజోరం, తెలంగాణ, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలలో పోలింగ్ నవంబర్ 7 నుంచి నవంబర్ 30వ తేదీ వరకూ జరుగుతుంది. మొట్టమొదల మిజోరంతో ప్రారంభమై చివరలో తెలంగాణ ఎన్నికలు జరుగుతాయి.

ఛత్తీస్ గఢ్ లో రెండు దఫాలలో పోలింగ్ జరుగుతుంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, మిజోరంలలో ఒకే ఒక రోజులో పోలింగ్ పూర్తవుతుంది. మధ్యప్రదేశ్ లో నవంబర్ 17న, రాజస్థాన్ లో నవంబర్ 23న పోలింగ్ జరుగుతుంది. ఛత్తీస్ గఢ్ లో నవంబర్ 7న, 17న రెండు విడతలలో పోలింగ్ జరుగుతుంది.

తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలకు ఒకే ఒక రోజు, నవంబర్ 30న, పోలింగ్ జరుగుతుంది. తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీకీ, కాంగ్రెస్ పార్టీకీ మధ్య ప్రధాన పోటీ ఉంటుంది. బీజేపీ కూడా గట్టి పోటీ ఇచ్చే ఉద్దేశంలో ఉన్నది. అమిత్ షా మళ్ళీ త్వరలో తెలంగాణ రానున్నారు. ప్రధాని  నరేంద్రమోదీ ఇటీవలే మహబూబ్ నగర్, నిజామాబాద్ సభలలో మాట్లాడారు. కానీ కాంగ్రెస్ కు మంచి ఊపు వచ్చింది. బీఆర్ఎస్ నుంచి రాజీనామా చేసిన నాయకులలో ఎక్కువ మంది కాంగ్రెస్ లో చేరుతున్నారు. దాంతో కాంగ్రెస్ లో జోరు పెరిగింది. బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు రెండు వారాలుగా అస్వస్థులై ఇంటికే పరిమితమై ఉన్నారు. కానీ ఆయన కుమారుడు కె. తారకరామారావు, అల్లుడు హరీష్ రావు నియోజకవర్గాలలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రారంభోత్సవాలూ, శంకుస్థాపనలూ, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు.

సరిగ్గా అయిదేళ్ళ  కిందట జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ ఛత్తీస్ గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ లలో విజయాలు సాధించింది. కానీ మధ్య ప్రదేశ్ లో కమల్ నాథ్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడిన కొన్ని మాసాలకు జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ పార్టీ నుంచి తన సన్నిహితులతో  సహా నిష్క్రమించడంతో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయింది. శివరాజ్ సింగ్ చౌహాన్ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. జ్యోతిరాదిత్య కేంద్రంలో మంత్రి పదవి స్వీకరించారు. ఎన్నికలలో కాంగ్రెస్, బీజేపీకి దాదాపు సమానంగా స్థానాలు దక్కాయి. బీజేపీకి 109 స్థానాలు రాగా కాంగ్రెస్ కి 114 స్థానాలు వచ్చాయి. 230 మంది సభ్యులున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీలో 116 స్థానాలు ఎవరికి దక్కితే  వారిదే ప్రభుత్వం.

రాజస్థాన్ అసెంబ్లీలో ఉన్న 200 స్థానాలలో కాంగ్రెస్ వంద స్థానాలనూ, బీజేపీ 73 స్థానాలనూ గెలుచుకున్నాయి. 101 స్థానాలు ఉన్న పార్టీ ప్రభుత్వం ఏర్పాట చేయాలి.  చివిరికి అశోక్ గెహ్లాట్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆరు సీట్లు గెలుచుకున్న బహుజన సమాజ్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలపరిచింది.  రాజస్థాన్ లో మరో యువనాయకడు సచిన్ పైలెట్ చేసిన తిరుగుబాటు విఫలమైంది.

ఛత్తీస్ గఢ్ లో కాంగ్రెస్ 68 స్థానాలు గెలుచుకోగా, బీజేపీ కేవలం 15 స్థానాలు గెలుచుకున్నది. భగేల్ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. 90మంది శాసనసభ్యులు ఉండే ఛత్తీస్ గఢ్ శాసనసభలో 46 సీట్లు మెజారిటీ మార్కు.

తెలంగాణలో ప్రాంతీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) అధికారంలో కొనసాగింది. 119స్థానాలు ఉన్న అసెంబ్లీలో మెజారిటీ రావాలంటే 60 స్థానాలు ఉండాలి. టీఆర్ఎస్ 88 స్థానాలు గెలుచుకున్నది. కాంగ్రెస్ పార్టీ 19 స్థానాలూ, ఎంఐఎం ఏడు స్థానాలు గెలుచుకోగా బీజేపీ ఒకే ఒక స్థానం కైవసం చేసుకోగలిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి పెద్ద స్థాయిలో  పార్టీ ఫిరాయింపులు జరిగాయి. దాదాసు 12 మంది కాంగ్రెస్ శాసనసభ్యులు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకకున్నారు. వీరిలో కొందరు మత్రులు కూడా అయ్యారు.

చివరిగా మిజోరంలో 2018 ఎన్నికలలో మిజో నేషనల్ ఫ్రంట్ ఘన విజయం సాధించింది. మిజోరం అసెంబ్లీలో ఉన్న 40 స్థానాలలో 27 స్థానాలను నేషనల్ ఫ్రంట్ గెలుచుకున్నది. కాంగ్రెస్ నాలుగు స్థానాలూ, బీజేపీ ఒక స్థానం గెలుచుకున్నాయి. తక్కిన స్థానాలు ఇండిపెండెంట్ అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. మిజోరం అసెంబ్లీ కాలం డిసెంబర్ లో ముగుస్తుంది. తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలలో అసెంబ్లీల గడువు జనవరి వరకూ ఉన్నది.

నవంబర్ 3న తెలంగాణ నోటిఫికేషన్ వస్తుంది. నవంబర్ 10 నామినేషన్ల స్వీకరణకు ఆఖరు తేదీ. నవంబర్ 13న నామినేషన్ల పరిశీలన, నవంబర్ 15 నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరి తేదీ, నవంబర్ 30న పోలింగ్, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles