నవయుగ వైతాళికుడు
గిడుగు సాంగంత్యంతో
తెలుగు భాషకు
వ్యవహారిక సొగసులద్దిన వాడు
ఆంగ్ల సాహిత్య పోకడలను ఆపోసన పట్టి
రాయప్రోలు తోడుగా
తెలుగు కవితను
వినూత్న బాటలు పట్టించిన వాడు
ఆత్మ న్యూనతకు లోనుకాకుండా
పరాయి మంచిని అందుకోవడం చూపిన వాడు
కాల్పనిక కవిత్వానికి బాటలు వేసినవాడు
తెలుగు కవితా కన్య ఛందో బంధాల చెర విడిపించి
ముత్యాల సరాలు అలంకరించిన ఆధునికుడు
దేశానికి, తెలుగు భాషకు గట్టి మేల్ తలపెట్టిన వాడు
వోల్టైర్, రూసో, అబ్రహాం లింకన్ల కంటే స్పస్టంగా
దేశమంటే ఎల్లల మధ్య భూమి కాదని నేర్పిన వాడు
బ్రహ్మ సమాజం, కందుకూరి, గాంధీల స్ఫూర్తితో
కవితలలో దేశ భక్తి, సంఘ సంస్కరణ కలబోసిన వాడు
సమాజం గురించి అహరహం తపించినవాడు
ఆధునిక వచన కవితకు మూల పురుషుడు
నిజమైన యుగ సమ్రాట్
స్మరణీయుడు
అభినందనీయుడు
వందనీయుడు
నేటి తెలుగు రూపశిల్పి
మన గురజాడ.
Also read: “క్షాత్రం”
Also read: వావిలాల వంటి రాజకీయ నాయకులు ఇకపై ఉంటారా?
Also read: “గిడుగు రామ్మూర్తి పంతులు”