ఆగస్టు 31 నాడు భాద్రపదనెలలోశ్రావణం పుర్ణిమనాడు రాఖీ పూర్ణిమ, జంధ్యాలు పూర్ణిమ అని, హయగ్రీవ జయంతి కలిగినవాడని ఆరాధించాలి. ‘హయం’ అనగా గుఱ్ఱం, ‘గ్రీవం’ అనగా కంఠం. హయగ్రీవుడు, హయశీర్షగా కూడా అంటారు. శ్రీహరి అవతారాలలో ‘హయగ్రీవావతారం’ విశిష్టమైనది. హయగ్రీవ స్వామి అవతరించిన రోజు.
హయగ్రీవునికి తెలుపురంగుపూలు, యాలుకలతో చేసిన మాల, గుగ్గిళ్ల నైవేద్యం సమర్పించాలి. ఆ రోజున అక్షరాభ్యాన్ని కూడా చేస్తారు.
అశ్వ ముఖంతో మానవ శరీరంతో వామాంకమున శ్రీ లక్ష్మీదేవితో తెల్లని శరీర ఛాయతో, చతుర్భుజాలతో, శంఖ, చక్రం దాల్చిన శ్రీమన్నారాయణుడి గురురూపమే హయగ్రీవ స్వరూపంలో వారిలోక్రింది కుడి వ్రేళ్ళు జ్ఞాన ముద్రలో అక్షరమాలను కలిగి ఉంటాయి. ఎడమ చేతిలో పుస్తకము ఉంటుంది.
హయగ్రీవుడిపురాణంలో పూర్వం గుర్రపుతల ఉన్న ఓ రాక్షసుడు ఉండేవాడు. తనవలెనే గుర్రపు తల ఉన్న వ్యక్తి చేతిలోనే, తనకు మరణం ఉండాలన్న వరం ఆ రాక్షసునికి ఉంది. కనుక సంహరించేందుకు విష్ణుమూర్తి, హయగ్రీవ అవతరించి విష్ణువు హయగ్రీవుని శత్రునాశకుడని అన్నారు. హయగ్రీవుడు పేరుతో రూపంలో ఉండే రాక్షసుడిని వధించి దేవదేవుడైన హయగ్రీడిని ఆరాధించడం జ్ఞానమూ విజయమూ లభిస్తాయి. హయగ్రీవునిలో సకల దేవతలూ కొలువై ఉన్నారని సూర్యచంద్రులు కళ్లుగా, దేవతలు ఎముకలుగా, అష్టవసువులు పాదాలుగా, అగ్ని నాలుకగా, సత్యం వాక్కుగా, బ్రహ్మ హృదయంగా, ఆయనలోని అణువణువూ దేవతామయమనిన దేవదేవుడు అని పూజించాలని పురాణాలు అంటున్నాయి.
మరో సారి హయగ్రీవ సతీమణియైన మహాలక్ష్మిని మరిచిపోయారు. హయగ్రీవ స్వామి వైష్ణవ సంప్రదాయంలో ఉన్నత చదువు, లౌకిక విషయాలను అధ్యయనం ప్రారంభించినప్పుడు హయగ్రీవ స్వామిని తప్పక పూజించాలి. విద్యార్థులు హయగ్రీవ స్వామిని ప్రతి రోజు ద్యానించాలి.
ఇంకోసారి మధుకైటభులు అనే రాక్షసులు వేదాలను ఎత్తుకుపోయారు. మరో సందర్భంలో హయగ్రీవ అవతారాన్ని ధరించి, విష్ణుమూర్తి రాక్షసులు మధుకైటభులను వధించి వేదాలను రక్షించినారు. ఆ రాక్షసులు దొంగిలించిన వేదాలను ఈ హయగ్రీవుడే తిరిగి తెచ్చినట్టు విష్ణు ధర్మోత్తరం వివరిస్తున్నారు.వేదాలనే రక్షించిన కనుక హయగ్రీవుడు జ్ఞాన ప్రదాతగా భావిస్తారు.వేదాలు జ్ఞానానికీ, వివేకానికీ చిహ్నాలు. హయగ్రీవుడు అంటే గుర్రపు తల ఉన్నవాడు అని అర్థం. హయగ్రీవుని వాదిరాజతీర్థ ద్వైత వేదాంతి గారు ఈ కింది రచించిన శ్లోకం పఠించాలని సంప్రదాయం.హయగ్రీవస్వామిని 11 సార్లు ఈ స్తోత్రాన్నిపఠించాలి.
జ్ఞానానంద మయం దేవం నిర్మల స్ఫటికాకృతిమ్|
ఆధారాం సర్వవిద్యానాం హయగ్రీవ ముపాస్మహే ||
jñānānandamayaṃdevaṃnirmalasphaṭikākṛtiṃ
ādhāraṃsarvavidyānaṃhayagrīvaṃupāsmahe
ज्ञानानन्द मयं देवं निर्मल स्फटिकाकृतिं
आधारं सर्वविद्यानं हयग्रीवं उपास्महे
అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ సన్నిదిలో, సత్యనారాయణ వ్రత కథ చెప్పే పండితులు పై మంత్రాన్ని చదివి కథ మెదలు పెడతారు.హయగ్రీవుని స్తోత్రం చదవాలి.
హయగ్రీవ స్తోత్రము:
హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వాదినం |
నరం ముంచంతి పాపాని దరిద్రమివ యోషితః|| 1 ||
హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపదేత్ |
తస్య నిస్సరతే వాణీ జహ్నుకన్మా ప్రవాహవత్|| 2 ||
హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోధ్వనిః | వి
శోభతే చ వైకుంఠ కవాటోద్ఘాటన ధ్వనిః|| 3 ||
ఫలశ్రుతి
శ్లోకత్రయ మిదం దివ్యం హయగ్రీవ పదాంకితం |
వాదిరాజయత్రిప్రోక్తం పఠతాం సంపదాంప్రదం|| 4 ||
మైసూర్ పరకాల మఠంలో
మైసూర్ (కర్నాటక) నగరంలో పరకాల మఠంలో ప్రార్థన అర్చామూర్తి రూపాన్ని దర్శించుకోవచ్చు.
మరో విశేషం ఏమంటే 1000 ఏళ్ల క్రిందట కాలంలో శ్రీ రామానుజ స్వామి తమిళ నాడు అనేక శిష్యులతో వెంటరాగా కాశ్మీర్ కు వెళ్లారు. బ్రహ్మసూత్రాలను రుషి బోధాయన భాష్యంపైన పుస్తకాన్ని సాధించడానికి కాశ్మీర్ కు చేరుకున్నారు. అప్పుడు శారదాదేవిని మెచ్చి శ్రీరామానుజుని అనుగ్రహించి అర్చించి, అర్పించారు.
ఆ తరువాతి కాలంలో మైసూరు పరకాల మఠంలో కొలువు తీరారు. ఈనాటికీ ఈ హయగ్రీవ స్వామి మూర్తిని దర్శించవచ్చు. (ప్రతిఏకాదశి నాడు అభిషేకం చేస్తారు)
మరో విశేషం
శ్రీరామనుజుని సరస్వతీ సాక్షాత్కారం చేసిన ఘట్టాన్ని ఒక చిత్రకారుడు ఈ చిత్రంలో ఉంది.
మాడభూషి శ్రీధర్ 31.8.2023