భగవద్గీత–92
కోటి ఊహలతో అత్తవారింట అడుగుపెడుతుంది కొత్త పెళ్ళికూతురు. అక్కడన్నీ తన ఊహలకు విరుద్ధంగా జరుగుతుంటాయి. తను అనుకున్నట్లుగా భర్త ఉండడు, అత్తమామలుండరు. అంతా తారుమారు. ఆశాభంగమయ్యింది విడాకులు కోరుకుంది.
ఒక వ్యక్తి ధనవంతుడైనా, దరిద్రుడైనా, అధికారపక్షం వాడైనా, ప్రతిపక్షం వాడైనా రూలు ఏమి చెపుతుందో దానిని నిజాయితీగా చేయాలనే ఆశయాలతో, ఊహలతో మొదటి ఉద్యోగంలో అడుగుపెట్టాడు. ఆ విధంగా చేయాలని ప్రయత్నించాడు. అధికారపక్షం వాడికి నష్టం కలిగింది. అంతే అతని మీద కోపం పెంచుకొని శంకరగిరిమన్యాలు పట్టించాడు. చాలా అసౌకర్యమైన ప్రదేశమది.
Also read: ఆత్మజ్ఞానంతో పరబ్రహ్మస్వరూపం సాక్షాత్కారం
ఆర్ధిక సంస్థలలో, బ్యాంకులలో బాగా డబ్బు దాచుకున్నవాడు quickest service ఆశిస్తాడు. అతను బ్యాంకుకు రావటానికి ముందే డబ్బు ఏమీ దాచుకోని వందమంది అక్కడ ఉన్నారు. వీరికి చేసిన తరువాత కదా ఆ ధనికుడికి చేయాలి అని కుర్ర అధికారి first come first serve rule పాటించాడు అనుకోండి. అంతే! వాడి సంస్థకు డబ్బున్నవాడు రావడం మానేస్తాడు. డిపాజిట్లు పడిపోతాయి. పైవాడితో తిట్లు. ప్రమోషన్ కు తూట్లు.
ఒకమనిషి తాను ఏమి చేయాలి అని అనుకున్నాడో, అతని ఊహలలో ఏమి తిరుగుతున్నదో దానిని చేయటానికి సంకల్పిస్తాడు. కానీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉంటాయి. ఇలా ప్రతి కార్యక్షేత్రంలో చేయాల్సింది ఒకటి. చేసేది మరొకటిగా ఉంటుంది.
Also read: భగవద్గీత అర్థమవుతే జీవితం అర్థం అవుతుంది
అంటే?
వాస్తవానికి, expectationకి మధ్య ఒక పెద్ద అగాధం ఉంటుంది. ఈ అగాధాన్ని దాటడానికి మనిషి పడే శ్రమే ఒత్తిడని పిలవబడుతుంది. Stress is directly related to the Gap between Expectation and reality.
ఎదురుగా ఉన్న అందరూ తన బంధువులే. వారితో తాను ఆడిపాడి ఆనందంగా జీవితం గడిపాడు. అలానే జీవితం సాగిపోవాలి అని అనుకున్నాడు. కానీ… వారితో యుద్ధం చేసి చంపాల్సిన పరిస్థితి దాపురించింది. ఆ వాస్తవాన్ని ఎదుర్కొనే శక్తిలేక వణికిపోయాడు అర్జునుడు.
వణికిపోయినవాడిని ఊరికే వదిలేశాడా? లేదు, ఆ వణుకుకు కారణమేమిటో వివరించాడు అర్జునుడి చెలికాడు కృష్ణపరమాత్మ. Root cause analysis చేశాడు. ఏమి చెయ్యాలో కర్తవ్యబోధ చేశాడు. అంతా చేసి చివరికి నీకు ఏది ఇష్టమయితే అది చెయ్యి అని చెప్పాడు. యథేచ్ఛసి తధాకురు అన్నాడు కదా అని ఇష్టమొచ్చినట్లు చేయటం కాదు.
ఇతితే జ్ఞానమాఖ్యాతం గుహ్యాద్గుహ్యతరం మయా
విమృశ్యైతదశేషేణ యథేచ్ఛసి తథాకురు!
అతి రహస్యమైన ఈ జ్ఞానము నేను నీకు తెలిపాను. ఈ జ్ఞానము బాగా వంటపట్టించుకొని నీకు ఏదితోస్తే అది చెయ్యని అర్ధం.
First go to the bottom of the cause. Analyse. Arrive at a decision then do accordingly. Understand the situation first. Manage the situation.
SITUATIONAL MANAGEMENT
Then where is STRESS?
Also read: భగవంతుడు సర్వాంతర్యామి