Saturday, November 23, 2024

భగవంతుడు సర్వాంతర్యామి

భగవద్గీత89

బంగారం అంటే ఎనలేని మోజు మనిషికి. వజ్రం ఓహో అపురూపం. వెండిసామాన్లు ఇంటినిండా. వీటిని సంపదలనుకొని పోగేసుకుంటున్నాము. మరి నిజమేమిటి? సరే! మనం చదువుకున్న సైన్సు ఏమి చెపుతున్నది?

సృష్టిలో ఏ పదార్ధాన్ని అయినా తీసుకుని విడగొట్టి రేణువుగా చేశాం. అది ఆ పదార్ధపు పరమాణువుగా కనపడుతుంది. అంటే బంగారపు పరమాణువు, వెండి పరమాణువు. ఇలా ఆయా పదార్ధాల పేర్లమీద ఆ పరమాణువు పిలవబడుతుంది. ఈ పరమాణువులను ఇంకా విడగొట్టాం. మనకు ఏం కనపడుతుంది? అన్నింటిలో ఒకటే, అంతటా ఒకటే. అవే ప్రోటాన్లు, ఎలక్ట్రాన్‌ లు, న్యూట్రాన్లు.

Also read: శ్రద్ధాభక్తులు లేని కార్యం నిష్ప్రయోజనం

ఎంతపెద్ద రాజసౌధమైనా, పూరిగుడిసె అయినా కట్టింది ఆ ఇటుకతోనే.

ఇక ఎలక్ట్రాన్‌ ఒక రేణువా? కాదు తరంగము. ఒక తరంగమా? కాదు రేణువు. ఇప్పుడే ఇక్కడ చూశాను. అది అక్కడున్నదేమిటి? అక్కడున్నది అప్పుడే అది ఇక్కడకు వచ్చినదేమిటి? ఏమిటి ఈ మాయ? కదలకుండా ఉన్నదన్న పదార్ధంలో ఇంత విపరీత వేగంతో ఈ చలనాలా?

‘‘ఆ ఎలక్ట్రాన్‌ దగ్గరగా ఉంటుందా, దూరంగా ఉంటుందా, రేణువా లేక తరంగమా మనకు తెలిసికొన శక్యముకాదని’’ హైసెన్బర్గ్‌ అనేశాస్త్రవేత్త ఎప్పుడో చెప్పారు. దాని పేరు Heisenberg uncertainty principle. ఇదీ సైన్సు మనం చదువుకున్నది.

Also read: పక్కవాడి పొడ భరించలేకపోతున్నారా?

సర్వతః శృతిమల్లోకే సర్వమ్‌ ఆవృత్య తిష్ఠతి… ఎంత బాగా చెప్పాడు ఆ కిట్టయ్య.

సర్వతః శృతిమత్‌ అట. అంటే ప్రతిదీ ఆయనకు తెలుస్తుంది. అంతే కాదు సర్వమ్‌ ఆవృత్య అట అనగా అంతటా వ్యాపించి ఉన్నవాడట ఆయన.

అంతేనా!

సర్వేంద్రియ గుణాభాసం అచరం చరమేవ చ

సూక్ష్మత్వాత్‌ తదవిజ్ఞేయమ్‌ దూరస్థం చాంతికే చ తత్‌ !

చరాచర భూతములన్నింటికినీ బాహ్యభ్యంతరములయందు పరిపూర్ణముగా ఉండువాడును, చరాచరరూపుడును అతడే అతిసూక్ష్మరూపుడైనందువలన తెలిసికొన శక్యము కానివాడు. అతిదూరంగా అతిదగ్గరగా స్థితుడైనవాడు అతడే.

Also read: మానసిక ప్రశాంతతే స్వర్గం

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles