భగవద్గీత – 60
ఏ విధమైన భావావేశము లేకుండా మాట్లాడగలమా?
ఎల్లప్పుడూ సత్యాన్నే పలుకగలమా?
మనము మాట్లాడేది ఎప్పుడూ ఎదుటివాడికి చాలా ఇష్టంగా వుంటుందా?
మన మాట ఎదుటివాడి హితాన్నే అనగా మంచినే కోరుతుందా?
మనము ఏదైతే విద్యను నేర్చుకున్నామో నిత్యజీవితంలో ఆవిద్యను సమన్వయపరుస్తూ జీవిస్తున్నామా?
Also read: ఆహారము, గుణము
ఇవ్వన్నీ చేస్తున్నట్లయితే మనము వాచిక ‘‘తపస్సు ’’ చేస్తున్నట్లు.
అనగా వాక్కును మన అధీనంలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నట్లు. ఏం? వాక్కు మన అధీనంలో లేకపోతే ఏం జరుగుతుంది?
‘‘నోరా వీపుకు చేటే’’ అనే ఒక సామెత ఉంది. అంటే మాట అదుపులో లేకపోతే దెబ్బలు తింటావు అని అర్ధం. అలాగే ‘‘నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుంది ’’ అనే సామెతకూడా ఉన్నది. అంటే మనము మాట్లాడే మాట మన అదుపులో ఉంటే ఏ సమస్యలూ రావు అని అర్ధం. అయితే, మాటను అదుపులో పెట్టుకోవాలని, అసలు మాటాడకపోతే? మౌనవ్రతము ఎల్లప్పుడూ పాటిస్తే? రక్తపోటు పెరుగుతుంది.
మరి ఎట్లా ?
Also read: నిజమైన వ్యక్తిత్వ వికాసం అంటే ఏమిటి?
ఏది ఎప్పుడు మాట్లాడాలో, ఎంతవరకు మాట్లాడాలో, మన భావావేశాలను ఎంతవరకు వ్యక్తం చేయాలో తెలియడం ఒక కళ. ఆ తెలివితేటలు లేకపోతే సమాజంలో జరిగే వ్యవహారాలలో మనము విజయం సాధించలేము.
To what extent you can exhibit your Emotions.
Expression and Emotion can you pack them intelligently to achieve desired result?
If you can do that, you are going to be successful! Lest you should suffer setbacks!
Emotional intelligence drives you to become a leader. It catapults you to higher positions. That is your higher IQ gives you jobs, your high EQ (Emotional Quotient) makes you a leader. దీనిని పరమాత్మ వాచిక తపస్సు అని అంటారు. అంటే మనం మాట మాట్లాడటం ఒక తపస్సు అన్నమాట.
అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితంచ యత్
స్వాధ్యాయాభ్యసనం చైవ వాజ్ఞ్మయం తప ఉచ్యతే ! (17-15)
Also read: విశ్వరూపము దర్శించగలమా?