భగవద్గీత – 53
మనిషేమిటి? వాడి మనసేమిటి? ఆ మనసులోని మర్మమేమిటి?
వాడి గుణమేమిటి? ఆ గుణమున్నవాడి కర్మము ఏమిటి? అసలు ఎన్ని గుణాలున్నవి? ఏ గుణము ఆధిపత్యం వహిస్తే ఏ పరిణామాలు సంభవిస్తాయి?
సంసారి ఎవడు? సన్యాసి ఎవడు? సన్నాసి ఎవడు?
యోగి ఎవడు? త్యాగి ఎవడు?
భోగి ఎవడు? రోగి ఎవడు?
Also read: నోరు మంచిదవుతే ఊరు మంచిదవుతుంది
జీవి పుట్టుక ఏమిటి? గిట్టుట ఏమిటి?
పుట్టక ముందు ఎక్కడ ఆ జీవి నివాసం? గిట్టిన పిదప ఏది ఆవాసం?
అణువేమిటి? బ్రహ్మాండమేమిటి? వాటి స్వరూపమేమిటి?
బ్రహ్మాండ నాయకుడెవ్వడు?
పుట్టిన ప్రతి ప్రాణి కర్మ చేయాల్సిందే అని నిక్కచ్చిగా చెప్పి, ఆ కర్మ ఫలాన్ని మాత్రం ఆశించవద్దంటాడు.
ఇన్నీ చెప్పి అన్ని ధర్మాలను పరిత్యజించి నన్ను శరణు వేడమంటాడెందుకు? ఆయన పరిత్యజ్య అన్నాడు కానీ త్యజ్య అని అనలేదు!
ఏమిటి తేడా అని అడుగుతారేమో. పరి అంటే చివర అని అర్దం. అంటే! అన్నీ ఆచరించిన తరువాత చివరకు వదిలేయమన్నాడు.
Also read: ప్రకటనల మాయాజాలం
ఇంత చెపితేకానీ అర్జునుడు
నష్టో మోహః స్మృతిర్లబ్దా త్వత్ప్రసాదాన్ మయాచ్యుతా
స్థితోస్మి గత సందేహః కరిష్యే వచనం తవ
‘నాకు పట్టిన మోహం తొలిగింది. స్మృతిని పొందాను. సంశయరహితుడినయ్యాను.
నీ ఆజ్ఞ తలదాలుస్తాను అచ్యుతా’ అని అన్నాడు. అంతేకదా మోహం తొలిగితే కానీ ఎవరికయినా నిజరూప దర్శనమయ్యేది. అందుకే మనం మోహాన్ని తొలగించుకుందాం.
అదేమిటి మోహం తొలగించుకోవటం ఎలాగండీ జీవితం ఇంత రసభరితం అయితేనూ, అని అంటారా?
అయితే మీ ఇష్టం!
శ్రేయాన్స్వధర్మో విగుణః పరధరామత్స్వనుష్ఠితాత్
స్వధర్మేనిధనమ్ శ్రేయః పరధర్మో భయావహః
స్వంత ధర్మంలో చావటమే మేలు! అని ఆయనే అన్నాడుగా! నాదేంపోయింది.