భగవద్గీత – 47
ఒక మనిషికి ఎంత కావాలి? ఈ ప్రశ్న ఎంత మంది వేసుకొని ఉంటాము?
రోజూ గుప్పెడు గింజలు, తలదాచుకోవడానికింత చోటు, శరీర రక్షణ కోసం రెండు మూడు జతల బట్టలు.
వీటితో నేడు బ్రతకటమా?
Dammit! Impossible. యవ్వనంలో ఉన్నప్పుడు సరే. పంచేంద్రియాలు చాలా బలంగా వుంటాయి. ఎన్నోవిషయాల మీదికి వెడుతూ ఉంటుంది మనస్సు. అది వేటిమీదకు మళ్లిందో వాటిని స్వంతం చేసుకోవటానికిచేసే ప్రయత్నమే జీవన సమరంగా చెప్పబడుతున్నది.
Also read: మనం ఎటు పోతున్నాం?
మరి జీవిత చరమాంకంలో కూడా ఇంద్రియ వ్యామోహం తగ్గని లుబ్దావధాన్లు ఎంతోమంది.
కన్యాశుల్కం నాటకంలో మధురవాణి లుబ్ధావధానిని ‘‘ఓ పన్ను కదిలిందా? కన్నుకు దృష్టి తగ్గిందా? చూడండి మీ కండలు కమ్మెచ్చులు తీసినట్టు యెలా వున్నాయో’’ అని అంటుంది!
మధురవాణే అననక్కరలేదు. ఎవడికి వాడు తనను తాను అలాగే అనుకుంటాడు.
Also read: కృష్ణబిలం అనంతం, అనూహ్యం
ఆరాటం, ఆరాటం…అంతేలేని జీవన పోరాటం. చివరిక్షణందాకా, ఎవరూ ఏమీ తీసుకెళ్ళలేదు, తీసుకెళ్ళలేరు అని తెలిసినా. తెలిసినా బ్రతుకు తపన ఆగదు. నన్నుమించిన వాడులేడు. ఇప్పటికే ఇంత సంపాదించానుజ ఇంకా ముందు ముందు ఎంతో సంపాదిస్తా.
ఇదమ్ అద్య మయాలబ్దమ్ ఇమమ్ ప్రాప్స్యే మనోరధమ్
ఇదమ్ అస్తి ఇదమ్ అపి మే భవిష్యతి పునః ధనమ్
అంటూ `ఈహంతే కామ భోగార్దమ్` కామభోగములు అనుభవించటానికి ఇంకా ఇంకా ఆరాటపడుతూ ఉంటారట ఆసురీ ప్రవృత్తి ఉన్నవారు!
మన ప్రవృత్తి ఏమిటి? అది ఎందువల్లకలిగింది?
ఎవరికి వారు Track Down చేసుకోవలసినదే!
Also read: త్రిగుణాలకు అతీతంగా ఎదగాలి