Thursday, November 21, 2024

సత్వ గుణం గలవాడు యోగ్యుడు

భగవద్గీత – 43

Knowledge is a Golden Chain, Ignorance is an iron chain.

విజ్ఞానం అనేది మనలను బంధిస్తుంది.

ఎలా?

విజ్ఞాన సముపార్జన ఒక కోరిక. కోరిక బంధనానికే గదా దారి తీసేది! అందుకే అది బంగారపు సంకెల. ఎంతో సమాచారం మన మెదడులో చేరుతుంది. చేరిన సమాచారం ఊరకే ఉంటుందా? అది రకరకాల విశ్లేషణలకు దారితీస్తుంది. మనస్సు ఊహల తుఫాను కేంద్రమవుతుంది.

All the information starts rioting there. అదే ఏమీ తెలియని మూఢుడు, అజ్ఞాని తెలియనితనంచేత బంధింపబడతాడు. ఇది తమో గుణం. అవి ఇనుప సంకెలలు.

Also read: శ్రీవారి పాదకమల సేవాభాగ్యమే పరమావధి

జ్ఞానం కావాలి అనే కోరిక అంటే ఇచ్చ కలగటం సత్వగుణానికి నిదర్శనం. జ్ఞాన సుఖం కోరేవాడు సాత్వికుడు.

శరీర సుఖాలు, భోగాలు, అధికారం మీద ఆసక్తి ఇవన్నీ కూడా ఇచ్ఛకలగటమే, కోరిక కలగటమే దీనిని ’’ రజోగుణం’’ అంటారు.

ఈ మూడింటిలో ప్రతి గుణమూ కూడా మిగిలిన రెండిటినీ అణచివేయాలని  ప్రయత్నం చేస్తుంది.

ఎవరు ఏ గుణ ప్రధానుడో తెలుసుకోవడం ఎట్లా?

ముఖంలో తేజస్సు ఉట్టిపడుతూ అంతఃకరణములో చైతన్యము ప్రకాశిస్తూ, యుక్తాయుక్త వివేకము కలిగి ప్రవర్తించేవాడు ఎవరయినా సత్వగుణ ప్రధానుడే.

Also read: నేటి ఆలోచన రేపటి భవిష్యత్తు

ఇక భూకబ్జాలు చేస్తూ, అధికారం చెలాయిస్తూ, అన్నీ నాకే కావాలి అనుకుంటూ విలాసవంతమైన జీవితం గడిపేవాడు రజోగుణ ప్రధానుడు.

పనిచేయడానికి అనాసక్తి, మంచిచెడు విచక్షణ లేనివాడు ఎప్పుడూ నిద్రించే వాడు, అనగా నిద్రాదేవత వరించిన దరిద్రదామోదరుడు అన్నమాట…  వీడు  తమోగుణ ప్రధానుడు.

సాత్విక కర్మల ఫలము, సుఖము, జ్ఞానము, వైరాగ్యము జ్ఞాన సముపార్జనలో కలిగేసుఖం, అనిర్వచనీయమైనది. ఒక కావ్యాన్ని చదివితే వచ్చే ఆనందం బ్రహ్మానందంతో సమానమట.

రాజస కర్మలఫలము…దుః ఖము.

మానుషానందము అని ఒకటున్నది.

అది! ఈ భూమండలానికంతా ఒక చక్రవర్తి ఉన్నాడనుకోండి. వాడు అనుభవించేది ఇంత. అనుభవించేవాడు ఎప్పడూ దుఃఖిస్తూనే ఉంటాడు. తన దగ్గర ఉన్నది ఎవరయినా ఎప్పుడయినా తన కంటే ఘనుడు తన్నుకు పోవచ్చు.

“Threat” always exists!

 `తాడెక్కే వాడుంటే తలదన్నే వాడకొకడుంటాడు`! అని ఊరకే అనలేదు! ఎంతో మమకారంతో నావి అనుకొని కౌగలించుకున్నవాడికి అవిపోతే మిగిలేది దుఃఖమే కదా! అజ్ఞానం, ప్రమాదం, మోహం ‘‘తామస’’ గుణమిచ్చే ఫలాలు!

సత్వాత్‌ సంజాయతే జ్ఞానమ్‌ రజసః లోభ ఏవ చ

ప్రమాదమోహౌ తమసో భవతః అజ్ఞానమ్‌ ఏవ చ!

Also read: చేతిలో జపమాల, మనసులో మధుబాల!

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles