ఓ సారి రాధ కృష్ణుణ్ణి అడిగిందట:
కృష్ణా కోపం అంటే ఏమిటి అని.
వేరేవాళ్ళ తప్పు కి శిక్షను మనకి మనమే విధించుకోవడం అని
రాధ మరో ప్రశ్న వేసింది:
ప్రేమకీ స్నేహానికీ తేడా ఏమిటీ అని
ప్రేమ బంగారం అయితే స్నేహం వజ్రం అని కృష్ణుడి జవాబు
అదెలా అని అడిగిన రాధతో కృష్ణుడు అంటాడూ:
బంగారం ముక్కలయినా దానికి పూర్వ రూపం ఇవ్వొచ్చు, వజ్రం ముక్కలతే ఇక అంతే.
రాధ ఆడుతోంది: కృష్ణా నేను ఎక్కడెక్కడ ఉన్నాను?
కృష్ణుడు చెబుతున్నాడు: నా మనసులో, నా మాటలో, నా మురళిలో, నా గానం లో, నా హృదయ లయలో . ఇన్నేల నా తనువూ మనసూ సమస్తమూ నీవే రాధా
రాధకి ఓ డౌట్ వచ్చింది.
అయితే కృష్ణా మరి నేను లేనిది ఎక్కడ?
నిట్టూరుస్తూ కృష్ణుడు అన్నాడు:
నా విధి రాతలో.
అయితే కృష్ణా ప్రేమకు అసలు అర్థం? రాధ
అర్థమే ఉండేదయితే అది ప్రేమ ఎలా అవుతుంది? ఎందుకవుతుంది? కృష్ణుడు
(ఎక్కడో ఎప్పుడో విన్న దానికి అక్షర రూపం)
…..గొర్రెపాటి మాధవరావు
superb sir.. it is out of box article. Felt happy on knowing about definition of love from your pen…