Thursday, November 21, 2024

ఒక్క శ్లోకాన్నిఅర్థం చేసుకొని మననం చేసుకుంటే  చాలు!

భగవద్గీత – 34

వారు నిర్మించవలసినది ‘‘భక్తి సామ్రాజ్యం‘‘. కానీ నిర్మించినది ‘‘భోగ సామ్రాజ్యము‘‘.

వారి వద్ద ’’జ్ఞానం‘‘ ఇబ్బడిముబ్బడిగా ఉండవలే! కానీ వారివద్ద ’’ధనం‘‘ ఇబ్బడి ముబ్బడిగా ఉన్నది!

బ్రహ్మ సత్యం జగన్మిధ్య వారు చెప్పవలసినది కానీ, బ్రహ్మ మిధ్య జగత్‌ సత్యం వారు చూపుతున్నది!

Also read: త్రిగుణాల సమన్వయకర్త స్త్రీ!

వారి ఆశ్రమాలలో అడుగు పెడితే  ‘‘సత్యమ్‌ జ్ఞానమనంతం బ్రహ్మ’’. అనే భావన కలుగవలే. కలిగేది మాత్రం..

’’ధనమూల మిదమ్‌ జగత్‌’’

కదిలితే జనం

మెదిలితే ధనమ్‌

వారి తీరే ఘనమ్‌ ఘనమ్‌!

ఇప్పటి దాకా పేరే వినని దేవుళ్ళు! వారి ఆశ్రమాలలో కొలువుదీరి పూజలందుకుంటుంటారు! వీరూ ’’భక్తులే ‘‘!!! కానీ వీరి వద్ద జ్ఞానం ఉండదు అని నొక్కి వక్కాణించాడు పరమాత్మ!

‘‘కామైస్తైస్తైర్హృతజ్ఞానాః ప్రపద్యంతే న్యదేవతాః

తంతం నియమమాస్థాయ ప్రకృత్యా నియతాః స్వయాః’’

తైః తైః కామైః అని అన్నారు భగవానుడు. అంటే రకరకాల భోగవాంఛలు అన్నమాట. వాటిచేత జ్ఞానం అపహరింప బడ్డదట! ఎంత అద్భుతంగా చెప్పారు పరమాత్మ!

దానినే ‘‘హృతజ్ఞానాః’’ అని అన్నారు.

Also read: జ్ఞాని పరమాత్మకు మిక్కిలి ఇష్టుడు

అంతేనా! స్వయా ప్రకృత్యా నియతాః అంటే వారి వారి స్వంత స్వభావముచేత ప్రేరితులై …

తమ్‌ తమ్‌…వారి వారి

నియమమ్‌ ఆస్థాయ…అనగా నియమములను అనుసరించి,

అన్యదేవతా. .. ఇతరదేవతలను …

ఇక్కడ దేనికి ఇతరాలు వారు అని ప్రశ్న వేసుకుంటే వచ్చే సమాధానం బ్రహ్మానికి, అంతిమ సత్యానికి, Ultimate truth కి ఇతరాలు అనే సమాధానం వస్తుంది!

ప్రపద్యంతే… ఆరాధిస్తారు!

అందుకే మనం చూస్తున్నాం!

నేడు లోకంలో సత్యాన్వేషణ కూడా ఒక వ్యాపారవస్తువయిన సమయంలో ఎవరి పీఠం వారిది! ఎవరి దేవీదేవతలు వారివి! ఎవరి నిబంధనలు వారివి! ఈ విధంగా శ్రమలేని ఆశ్రమ వ్యాపారం సాగుతున్నది!

ఒక్క క్షణం తీరిక చేసుకొని భగవద్గీతలోని కనీసం ఒక్క శ్లోకాన్ని అర్ధం చేసుకుని రోజుకు కనీసం ఒక్కసారి మననం చేసినా చాలు! కొన్ని జీవిత కాలాలకు సరిపడా జ్ఞానం సంపాదించవచ్చు!

కానీ!

WE ARE BUSY! WE HAVE NO TIME!

Also read: జీవరూప పరాప్రకృతి

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles