భగవద్గీత – 28
ఏదిబడితే అది!
ఎక్కడబడితే అక్కడ!
పొట్టను చెత్తబుట్ట చేసి లోపల తోసివేస్తే!
Garbage in అయినప్పుడు garbage out కాక ఏమవుతుంది?
Also read: మనకు మనమే శత్రువు
శరీరధర్మ శాస్త్రం, physiologyలో Circadian rhythm అని ఒక భావన ఉన్నది. ఇది 24 గంటలలో మన శరీరం, మెదడు లోని patterns ఎలా ఏర్పడతాయి, మెదడులోని తరంగాలు ఆల్ఫా, బీటా, డెల్టా ఏర్పడే క్రమం, శరీరంలో హార్మోనుల ఉత్పత్తి, కణాల ఉత్పత్తి ఇలాగ అన్ని జీవరసాయన (Bio chemical reactions) ప్రక్రియలు నడిచే పద్ధతి అన్నమాట. ఈ సర్కాడియన్ క్లాక్ తో సూర్యుడి గమనం, భూమిపై ప్రసరించే వెలుతురు, చీకటికి అనుసంధానమయి ఉంటుంది!
ఏక కణజీవి నుండి అతిపెద్ద జంతువు దాకా (మనిషితో సహా) అన్నీ ఈ నియమాన్ని సహజంగా తమ ప్రమేయంలేకుండా పాటిస్తాయి.
బుద్ధి ఎక్కువ అయిన మనిషి తాను అన్నిటికీ అతీతుడను అని అనుకొని అడ్డదిడ్డంగా ప్రవర్తిస్తున్నాడు నేడు. వాడి బుద్ధి వాడికి భస్మాసుర హస్తం.
Also read : బ్రహ్మము తెలిస్తేనే బ్రహ్మర్షి
ఎటుపడితే అటు, కొండల్లో, కోనల్లో, ఎండల్లో, వానల్లో శరీర స్పృహ లేకుండా విహరిస్తే ఏమవుతుంది? శరీరం బండబారి పోతుంది.
మనిషి ప్రవర్తన ఎలా ఉండాలి ? సందర్భానుసారంగా ఉండాలి. పెద్దవాళ్ళ దగ్గర ఎలా ఉండాలి, పిన్నలతో ఎలా మెసులుకోవాలి, పై అధికారులతో ఎలా మెలగాలి, సమానులతో ఎలా జీవించాలి, క్రిందివారిని ఎలా treat చేయాలి. Different strokes to different folks అన్నట్టు వ్యవహరించాలి. ఇలా ప్రవర్తన తెలియక పోతే జీవితం దుర్భరంగా మారి పోతుంది!
అదే విధంగా మన ‘‘స్వ’’భావాన్ని అనుసరించి పనిచేయకపోతే చేసేపని తప్పనిసరి తద్దినంలాగ తయారవుతుంది!
సరైన నిద్ర, మెలుకువ లేకపోతే పైన చెప్పిన rhythm దెబ్బతిని ఆరోగ్యం పాడవుతుంది!
Eating is fun,
Roaming is fun,
To do is fun,
To be is fun,
Living is fun!
Loving is fun!
Then fun shall you be
Life shall shun you…
జీవితం దుర్భరం కాకుండా ఉండాలంటే!
కృష్ణపరమాత్మ చెపుతున్నారు!
‘‘యుక్తాహార విహారస్య యుక్తచేష్ఠస్య కర్మసు
యుక్తస్వప్నావబోధస్య యోగోభవతి దుఃఖహా! ’’
సరైన ఆహార, విహారాదులు,
సరైన ప్రవర్తన, పని,
సరైన నిద్ర, మెలకువ.
ఇవి పాటించే యోగికి దుః ఖము ఉంటుందా! ఉండదు!
అని అర్ధం!
Also read: సన్యాసి అంటే ఎవరు? కులం, వర్ణం అంటే ఏమిటి?