భగవద్గీత – 26
విశ్వామిత్ర మహర్షి బ్రహ్మర్షి అని అనిపించుకోవడానికి కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశారు. మొదట నాకు అర్ధంకాలే ఎందుకు అన్ని సంవత్సరాలు అని?
ఇంద్రుడు తపస్సు భగ్నం చేయటానికి గాలి దుమారాలు పుట్టించాడు, కుంభవృష్టులు కురిపించాడు, చివరకు మేనకను పంపించాడు! అని కథలు విన్నాం.
Also read: సన్యాసి అంటే ఎవరు? కులం, వర్ణం అంటే ఏమిటి?
నమ్మని వాళ్ళు ఇవి పుక్కిటి పురాణాలు అని తోసిపుచ్చారు. కొందరు గుడ్డిగా నమ్మారు.
ఋతము అంటే సత్యము. దేని గురించి ఋతము అంటే బ్రహ్మము గురించి.
బ్రహ్మము గురించి చెప్పాలంటే తానే బ్రహ్మము అని తెలుసుకోవాలి. దానికి యోగ మార్గము అవలంబించాలి.
యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి మార్గాలద్వారా ఇంద్రియాలను పూర్తిగా తన స్వాధీనంలోకి తెచ్చుకోవాలి. స్వాధీనంలోకి తెచ్చుకోవడమంటే అవి చేసే ఏ పనినయినా తోసి పుచ్చగలగాలి.
Also read : అంతా ఆత్మస్వరూపమే!
ఉదాహరణకు చల్లని గాలి వీస్తున్నది. అబ్బ హాయిగా ఉంది అని అనిపిస్తుంది. హాయిగా వున్నదని ఎట్లా తెలిసింది? మన చర్మానికి చల్లనిగాలి తగిలి అది మెదడుకు సంకేతం పంపితే ఆహా! హాయి అనిపించింది.
జీవులకు పునరుత్పత్తి చేయటం సహజలక్షణం.
స్త్రీ, పురుషులు ఒకరినొకరు చూసుకున్నారు. దేనితో? కంటితో! పునరుత్పత్తి చేయటం బలమైన ప్రకృతి ధర్మం కాబట్టి చూడగనే ఒకరికొకరు నచ్చారు. కన్ను మెదడుకి సంకేతం పంపింది. ఈ ‘‘నచ్చారు ‘‘అనే భావం ఎక్కడ పుట్టింది మరల మెదడులోనే.
అలానే మంచి వాసన, రుచి, శబ్దాలు అన్నీ మెదడు పంపే సంకేతాలే. ఈ సంకేతాలను మనం nullify చేయగలగాలి. అదేం చిన్న విషయం కాదు.
ఇంద్రుడు అంటే ప్రకృతి శక్తులకు అధిపతి!
Also read: ఎవరి జాతకం ఏమిటో ఎలా తెలియాలి?
మంచి శబ్దాలకు, రుచులకు, వాసనలకు, పునరుత్పత్తి కార్యక్రమాలకు మనిషి లొంగడం సహజం. ఇవన్నీ ప్రకృతి నుండే కదా వచ్చేది! ఇవన్నీ మరి ఇంద్రుడి అధీనంలో ఉన్నట్లే కదా! అంటే ఈ పరీక్షలన్నీ ఇంద్రుడు పెట్టినట్లే కదా!
మేనకకు లొంగిపోయాడు విశ్వామిత్రుడు అంటే ఆయన తన అధీనంలోకి ఇంద్రియాలు తెచ్చుకోనట్లే కదా!
మరి అవే స్వాధీనము కాకపోతే బ్రహ్మము ఎలా తెలుస్తుంది? బ్రహ్మము తెలియక పోతే బ్రహ్మర్షి ఎలా అవుతాడు? అంటే బ్రాహ్మణత్వం అంత తేలికగా సిద్ధించేది కాదనేగా?
ఒక social group లో పుట్టినంత మాత్రాన బ్రాహ్మణుడవుతాడా! కాడు, కాడు. అది ఏదో తెలుసుకుంటేనే! ఎవరైనా!
Also read: రాగద్వేషాలను విడిచినవాడు సన్యాసి!