భగవద్గీత – 24
అణువణువూ ఆతని ఆలయమే!
ఆయన లేని చోటు ఎక్కడ ఉంది?
అంతటా వ్యాపించి ఉన్న అనంత మూర్తి ఆతడు!
ఆతని స్వరూపం తెలుసుకొన్న వాడే పండితుడు!
ఆయనను తెలుసుకోవాలంటే ఆయనంత అయితేనే తెలుసుకోగలము!
రుద్రుడు కాని వాడు రుద్రుణ్ణి అర్చించలేడు!
న రుద్రః రుద్ర మర్చయేత్!
Also read: ఎవరి జాతకం ఏమిటో ఎలా తెలియాలి?
తెలుసుకున్న వాడెవరు ఆతడే!
తెలుసుకున్నది దేనిని అతడినే!
అంటే తనను తాను తెలుసుకున్నవాడు!
WHO AM I అన్న ప్రశ్నకు సమాధానం తెలిసిన వాడన్న మాట!
అప్పుడు…
పండితుడు, పామరుడు! శాకాహారి, శునకాహారి! కంకరరాయి, కోహినూరు వజ్రము! ఏనుగు, ఎలుకపిల్ల! సత్తురేకు, స్వర్ణాభరణము … అన్నీ ఒకటే! అంతా ఆత్మస్వరూపమే!
అందుకే పరమాత్మ ఇలా చెపుతున్నారు !!
‘‘విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని
శునిచైవ శ్వపాకే చ పండితాః సమదర్శినః ’’
Also read: రాగద్వేషాలను విడిచినవాడు సన్యాసి!