Saturday, November 23, 2024

స్వధర్మ ఆచరణే శరణ్యం

భగవద్గీత 12

తొలకరి చినుకు పుడమిని పలకరించింది…

అప్పటికి వర్షం పడి చాలా కాలమయ్యింది …

భూమి మీద చినుకులు పడి కాలువలు కట్టినాయి…

ఈ మొదటి వర్షపు నీరు భూమి మీద కాలవలు ఏర్పాటు చేసుకుంటూ వెళుతుంది! అంటే భూమిని కోసుకుంటూ వెళుతుంది. భూమి మీద కొన్ని patterns (అమరికలు) ఏర్పడతాయి. ఆ తరువాత వర్షాకాలంలో పడే ప్రతి నీటిబొట్టూ కూడా ఆ patterns నే అనుసరిస్తాయి.

Also read: అనుకరణ మానవ నైజం

భూమి అప్పుడే పుట్టింది, ఇంకా నదీనదాలు ఏర్పడలేదు! అప్పుడే పర్వతాల నుండి నీరు రావడం మొదలయ్యింది! ఆ నీరు ఎటు పల్లం ఉంటే అటు భూమిని కోసుకుంటూ ప్రవహించటం మొదలయ్యింది.

వాటికి ఒక గమన మార్గము ఏర్పడ్డది అంతే. కొన్ని కోట్ల సంవత్సరాలనుండి వాటి మార్గం అదే! వారణాసిలో గంగ ఎప్పటినుండి ఉన్నదో ఎవరికి తెలుసు.

మరి  కొన్ని నదులు వాటి గమన మార్గాన్ని మార్చుకున్నాయి అని పరిశోధనలలో తేలింది. అవి ఎప్పుడు జరిగింది అంటే, బ్రహ్మాండమైన భూకంపం వచ్చి భూమి  ఆకృతిలో  మార్పులు సంభవించినప్పుడు మాత్రమే. అప్పుడే పుట్టిన పసిపిల్లవాడిని ఊహించండి. వాడి మెదడు ఖాళీ మెదడు.

ఇంకా నదులేమీ ప్రవహించని భూమిలాంటిది అన్నమాట. వాడు తన చుట్టూ ఉన్న వాతావరణంలో జరిగే వాటిని తన ఇంద్రియాలతో గ్రహిస్తూ ఉంటాడు.

ఉదాహరణకు అన్నం ఎలా తినాలి? ఎలా స్నానం చేయాలి? ఎలా మాట్లాడాలి?  ప్రతిపని ఎలా చేయాలో తను పెరిగే వాతావరణంలో తన కంటికి లేదా తన ఇంద్రియాలకు గోచరమయిన విధంగా కొన్ని ఆలోచనలు మొదలవుతాయి.

Also read: సోమరులకు ప్రపంచంలో స్థానం లేదు

ఇవి భూమి మీద పడ్డ తొలకరి చినుకులు లాంటివి అన్నమాట. అప్పుడు అతని మెదడులో కొన్ని అమరికలు patterns ఏర్పడతాయి. ఆ ఆలోచనలు ఒక అమరికను సంతరించుకుంటాయి. Pattern thinking అన్నమాట.

ఏ విధంగా అయితే నది తన గమనమార్గాన్ని మార్చుకోకుండా నిరంతరం ప్రవహిస్తూ ఉంటుందో, మనిషి కూడా తను ఏ పని చేయాలన్నా design, pattern మాత్రమే అనుసరిస్తాడు. అది అతని స్వధర్మమవుతుంది. అతని మనోధర్మ మవుతుంది.

దానికి విరుద్ధంగా ఏదయినా జరిగితే విలవిలలాడి పోతాడు. చనిపోయినంతపని అవుతుంది. Change management, Paradigm shift మనం చెప్పినంత, మనం విన్నంత తేలిక కాదు. నది గమనం మారాలంటే భూకంపం రావాలి! Paradigm shift కలగాలంటే, మనిషికి Shock తగలాలి!

అర్జునుడు క్షత్రియుడు. అతను చిన్నప్పటినుండి ‘‘రాజ్యం వీర భోజ్యం’’ అన్న భావనతో పెరిగాడు. మహావీరుడు, మేటి విలుకాడు. ఉత్సాహం ఉరకలువేస్తూ రణరంగంలో దూకటం అతని స్వధర్మం. అంతేకాని భిక్షమెత్తుకు బ్రతకడం కాదు!

అందుకే భగవానుడు.

శ్రేయాన్‌ స్వధర్మో విగుణః పరధర్మాత్‌ స్వనుష్ఠితాత్‌

స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః అని అర్జునుడికి చెపుతున్నారు!

చక్కగా అనుష్ఠింప పడిన పరధర్మము కంటే గుణములు లేనిదయినా స్వధర్మము యొక్క ఆచరణలో చావు కూడా మేలే అని అంటున్నారు. అందుకే  follow your own thought. i.e. intuition!

Also read: సత్యాన్వేషణలో మూడు మార్గాలు

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles