Thursday, November 21, 2024

సత్యాన్వేషణలో మూడు మార్గాలు

భగవద్గీత – 9

Self propellant machine అంటే స్వయంగా తనంతట తానే పని చేసుకునే యంత్రము. అది ఇంత వరకు లేదు!

కానీ భగవత్‌ సృష్టిలో అలాంటి యంత్రాలు కోకొల్లలు!

అవేమిటి? అని మనం అడుగక మానము.

అవి 80 లక్షల జీవరాసులే.

ప్రతిజీవి తనంతట తను పనిచేస్తున్నది!

Also read: ప్రసాదభక్తి అంటే ఏమిటి?

మనం పని చేయించేటప్పుడు కంప్యూటర్‌ కానీ, ఫోనుకానీ, ఇంకా ఏ ఇతర యంత్రమయినా కానీయండి by default వాటిలో కొన్ని లక్షణాలుంటవి. అంటే తయారీదారు మొదట్లో install చేసిన ప్రోగ్రామ్సు. power on చేయగనే అవి మేము సిద్ధం అని మనకు సంకేతాలు పంపుతాయి.

మరి భగవంతుడి సృష్టించిన వాటిలో అలాంటి default లక్షణాలు ఏవీ!

పొద్దున్నే లేచిన ప్రతిప్రాణికి కడుపు నకనకలాడుతుంది. అది ఆహారం సంపాదించుకోవాలి. ఈ ఆహార అన్వేషణ నిరంతరం సాగాల్సిందే. ఎందుకంటే ఆహారం లేకపోతే మనుగడలేదు.

కాబట్టి ఆహార సంపాదన అనే ఆలోచన, అందుకు అనుగుణంగా మనం ప్రవర్తించడం by default మనం చేయాల్సిన ‘‘పని’’.  మరి ఒక్కొక్క ప్రాణి ఒక్కొక్క రకంగా సంపాదిస్తుంది. దానికి మనం ఏపేరయినా పెట్టుకోవచ్చు. ‘‘ఉదర పోషణార్ధం బహు కృత వేషం’’ ఈ సృష్టిలో తనకు ఆహారంగా ఒక ప్రాణిని ఎంచుకుంటే తను ఇంకొక దానికి ఆహారమవుతుంది!

Also read: ఏది పగలు, ఏది రాత్రి?

Prey and predator ఆహార సంపాదనలో అలసిపోయిన ప్రాణి తన శరీరావయవాలను మరమ్మత్తు చేసుకోవటానికి, అంటే self healing కొరకు కొంత సమయం కావాలి. ఆ సమయాన్నే ‘‘నిద్ర ‘‘అని అంటాము.

ఈ నిద్రాసమయంలో, లేదా జాగ్రదవస్థలో కానీ మరల తను ఇంకొకరికి ఆహారంగా మారకుండా ఉండాలి అనే భావన ప్రతి ప్రాణిలో ఉంటుంది. ఈ భావననే ‘‘భయం’’ అని అంటాము. అందుకు రక్షణగా మరుగు చూసుకుంటుంది.  మానవుడు ఇళ్ళు కట్టుకుంటాడు!

తన మనుగడ నిరంతరం ఉండాలి అనే ఇంకొక భావన కూడ ఉన్నది. అది ప్రతి ప్రాణిలో ఉంటుంది!

అందుకు తనను తాను పునరుత్పత్తి చేసుకుంటుంది. ఈ పునరుత్పత్తి భావనే ’కామం’. ఈ నాలుగు భావనలు by default మనందరిలో ఉన్నవే. ఈ భావనల వల్ల మనం తప్పని సరిగా ’’పని’’ చేయవలసినదే. లేకపోతే మనుగడ లేదు.

Also read: నిండిన చెరువు

Survival of fittest, selection of natural అని ఛార్లెస్‌ డార్విన్‌ చెప్పినది ఇది కాదా?

అందుకే భగవానుడు అంటున్నాడు!

‘‘న హి కశ్చిత్‌ క్షణమపి జాతు తిష్ఠత్యకర్మ కృత్‌

కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతి జైర్గణైః’’

ఏ మనుష్యుడు కూడ ఏ కాలమునందయినను క్షణమాత్రము కూడ కర్మను ఆచరింపకుండా ఉండలేడు! అలా కర్మను ఆచరించడమే ‘‘పని’’. ప్రకృతి జనితమయిన గుణములకు లోబడి ప్రతి వ్యక్తి కర్మ ఆచరించవలసినదే. ఇవ్వాళ మనం Career Path, time management, stress management ఇన్ని రకాల మాటలతో సతమవుతున్నాం! ఇప్పడు చెప్పండి ఇన్ని managements కూడా defaultగా వచ్చినవే కదా?

ఒకడు ఒక తోటకు వెళ్ళాడు. అక్కడ కొన్ని కాయలు కుప్పగా పోయబడి వున్నాయి.

తోటమాలిని ఇవి ఏ చెట్టు కాయలు అని అడిగాడు.

ఇవి ఫలానా చెట్టువి అని చెప్పాడతడు.

Also read: విషయవాంఛల విషవలయం

ఇవి ఆ చెట్టువేనా అనే సందేహం కలిగింది.

అప్పుడు ఆ సందేహం తీరడానికి ఏకైక మార్గం జన్యు పరీక్ష చేయించడమే.

ఇలా ప్రతి విషయాన్ని కూలంకషంగా పరిశీలించి సత్యశోధన చేసేవారిని ’’సాంఖ్యులు ’’ అని అంటాము.

వీరు సత్యాన్వేషణలో మూడు మార్గాలు ఆశ్రయిస్తారు

1) ప్రత్యక్ష ప్రమాణము.. direct proof.

2) అనుమాన ప్రమాణము. method of induction and inference.

3) శబ్దము, లేక ఆప్తవాక్యము. Testimony of reliable sources మొదటిది. ప్రత్యక్షం అక్షము అంటే కన్ను. ఇది ఒక ఇంద్రియము. ఇంద్రియాలకు వాటి విషయాలతో సంబంధం ఏర్పడటం వల్ల కలిగే జ్ఞానం రెండవది.

అనుమానం ఒక చోట పొగ కనపడింది, కాబట్టి వెంటనే మనం చెప్పవచ్చు అక్కడ నిప్పు ఉందని. మూడవది శబ్దం లేక ఆప్తవాక్యం. మా నాన్నగారు నాకు ఆప్తుడు, ఒరేయ్‌ నాన్నా నేను సింహాన్ని చూశాను అది ఈ విధంగా వుంటుంది, అని నాకు చెపితే నేను నిర్ద్వంద్వంగా నమ్ముతాను..ఎందుకు? నా తండ్రి చెప్పేది సత్యం. అంతే!

స్వామి వివేకానందుడు రామకృష్ణులను మీరు దేవుడిని చూశారా? అని ప్రశ్నిస్తాడు. నీతో మాట్లడినట్లే నేను మాట్లాడాను అని అంటారు రామకృష్ణులు. వివేకానందుడికి నమ్మకం కలుగక రకరకాల పరీక్షలు పెట్టి పరమహంస చెప్పిన దాంట్లో సత్యం గ్రహిస్తాడు (అప్పటికి రామకృష్ణులు వివేకానందుడి ఆప్తుల చిట్టాలో లేరు) సాంఖ్యులు ప్రకృతి (matter), పురుషుల (consciousness) ల సంయోగము వలన జీవము కలిగింది అని నమ్ముతారు.

మాధవా మాటల మాయాజాలంలో నన్ను అయోమయానికి గురి చేస్తున్నావయ్యా నాకు శ్రేయస్కరమైన మార్గం ఏది? అని అర్జునుడు అడిగితే !

భగవానుడు ఇలా చెపుతున్నాడు !

‘‘లోకేస్మిన్‌ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్తా మయానఘ

జ్ఞాన యోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినామ్‌’’

ఓ అనఘా (పాపరహితుడా) అర్జునా, ఈ లోకంలో రెండు విధాలయిన నిష్ఠలున్నవి. వాటిలో జ్ఞానయోగము ద్వారా సాంఖ్యులకు (వీరు జ్ఞాన సముపార్జన చేస్తారు)

కర్మయోగము ద్వారా యోగులకు నిష్ఠ కలుగుతుంది నిష్ఠ అంటే ధర్మము యందు నమ్మకము, నిశ్చయము.

Also read: ఏది సత్యం, ఏదసత్యం? ఏది నిత్యం, ఏదనిత్యం?

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles