Sunday, November 24, 2024

విషయవాంఛల విషవలయం

భగవద్గీత. 5

Daniel Goleman అని హార్వర్డు యూనివర్సిటీ అధ్యాపకులు ఒకాయన Emotional Intelligence అనే పుస్తకం వ్రాశారు. అందులో కోపం వచ్చిన తరువాత ఏం జరుగుతుందో విశ్లేషణ చేశారు!

కోపము రాగానే రక్త ప్రసరణ అధికమయి చేతులు దృఢంగా మారి ఏదో  ఒక అయుధం తీసుకొనో లేక చేతులనే అయుధంగా మార్చో ఏదుటి వాడిమీద కలయడటతాడు మనిషి!  అతని శరీరంలో హార్మోనుల ఉత్పత్తి పెరుగుతుంది, ఏడ్రినాలిన్‌ ఒక్కసారిగా ‘పంప్‌’ చెయబడుతుంది. దానివలన అతను యుద్ధానికి సిద్ధమవుతాడు. లేదా బలం చాలదనుకున్నప్పుడు  పారి పోవడానికి సిద్ధమవుతాడు.

Also read: ఏది సత్యం, ఏదసత్యం? ఏది నిత్యం, ఏదనిత్యం?

అంటే, కోపంవల్ల ఎడ్రినాలిన్‌ ఉత్పత్తి ఎక్కువ అయి మనిషి Fight or flight situation లోకి తోసి వేయబడతాడు.

ఇదన్నమాట కోపం వచ్చిన తరువాత ఏం జరుగుతుంది అంటే!

మరి అసలు కోపం రావడానికి కారణం ఏమిటి? మరల Go to the bottom of the cause.

మనలను గీతాచార్యుడైన శ్రీ కృష్ణపరమాత్మ అక్కడికే తీసుకెళుతున్నాడు. సదా విషయవాంఛలను మననము చేయువానికి వాటియందు ఆసక్తి కలిగి అనురాగము అధికమయి అది కోరికగా మారుతుంది. ఆ కోరిక తీరనప్పుడు మనిషికి క్రోధం పుడుతుంది. ఆ క్రోధం మనిషి యొక్క జ్ఞాపకశక్తిని నశింపచేస్తుంది. అప్పుడు మనిషి తన బుద్ధిని (rational discrimination) కోల్పోతాడు, బుద్ధి కోల్పోయిన మనిషి పతనమవుతాడు.

Also read: అంతా మనమంచికే…

విషయవాంఛలు అంటే ఏమిటి?

వాంఛ అంటే కోరిక, మరి విషయాలంటే? పంచేంద్రియాలు వేటిని గ్రహిస్తాయో అవి విషయాలు!

కన్ను – దృశ్యాన్ని,

చెవి -శబ్దాన్ని,

ముక్కు -వాసనని,

నాలుక -రుచిని,

చర్మం -స్పర్శని గ్రహిస్తాయి.

శబ్ద, స్పర్శ, రూప, రస గంధాలు అన్నమాట!

Also read: మనసు చేసే మాయాజాలం

తెల్లవారి లేచినదగ్గరనుండి ఇంట్లో ఇడియట్‌ బాక్సులో (T.V) లో ఒకటే ప్రకటనల హోరు. ఈ ప్రకటనలు దేనిగురించి అని గమనించండి ! అన్నీ’’విషయాల’’ గురించే. అది కొను, ఇది కొను అని మనలని ప్రేరేపించడం వాటి పని. వాటి మత్తులో పడ్డ మనిషి తన దగ్గర డబ్బుంటే కొనడం వరకూ O.K. లేని వాడికి?

నీ కిష్టమయినది కొనుక్కోవడానికి మేము అప్పిస్తాం అంటే మేమిస్తాం అంటూ మళ్ళీ ఆర్ధిక సంస్థల ప్రకటనల జోరు. ఈ హోరులో జోరులో పడి మనిషి కొట్టుకు పోయి కొనుగోళ్ళు పెంచుతున్నాడు. అందుకు అనుగుణంగా ఉత్పత్తి పెరుగుతున్నది. ఓహ్ మన ఆర్దికవేత్తలు G.D.P ఇంత పెరుగుతుంది అంత పెరుగుతుంది అని అంచనాలు, దేశం దూసుకుపోతున్నది, వెలిగిపోతున్నది అని కేరింతలు.

కానీ, విషయ వాంఛల సుడిగుండంలో పడి మనిషే..నలిగిపోతున్నాడు.

Also read: భగవద్గీత

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles