భగవద్గీత – 4
Go to the bottom of the cause అని స్వామి వివేకానందుడు అన్నారు.
మూలంలోకి ఎందుకు వెళ్ళాలి ?
వెళితే ఎమవుతుంది?
కావడిబద్ద కొయ్యముక్కేనని, కుండలు మన్నే అన్న సత్యం తెలుస్తుంది.
సత్యం తెలిస్తే మనకు ఒరిగేదేమిటి అన్న ప్రశ్న వెంటనే ఉత్పన్నమవుతుంది.
సత్యం తెలిస్తే మనిషి భ్రాంతి నుండి విముక్తుడవుతాడు.
Also read: అంతా మనమంచికే…
మన కోరికలు, వాటి స్వరూపం పూర్తిగా తెలుస్తుంది.
అలా తెలిసినప్పుడు కోరికలన్నీ మనస్సు నుండి తుడిచి పెట్టుకు పోతవి.
కోరికలు అనే మసి తుడిచివేయబడ్డప్పుడు ఆత్మజ్యోతి దేదీప్యమానంగా ప్రకాశిస్తుంది. ’ఏది సత్యం, ఏది అసత్యం, ఏది నిత్యం ఏది అనిత్యం’ అన్నవిషయంలో ఒక స్పష్టత వస్తుంది.
అప్పుడు మనిషికి దుఃఖము, సుఖము రెండూ సమానమే, చూసేవారికి దుఃఖము అని అనిపిస్తుంది. కానీ మూలంలోకి వెళ్ళి విచారణ చేసేవాడికి ఆ దుఃఖము దుఃఖంగా అనిపించదు. అందుకే అతను కుంగిపోడు.
అలాగే సుఖము కలిగి నప్పుడు పొంగిపోడు.
Also read: మనసు చేసే మాయాజాలం
అతనికి దేని పట్ల అనురాగముండదు, ద్వేషముండదు, ఎవరిమీద కోపముండదు.
అలాంటి వ్యక్తిని స్థితప్రజ్ఞుడు అని అంటారు.
It is unperturbed consciousness, అలాంటి స్థితి రావడం అంత సులువుకాదు.
అభ్యాస వైరాగ్యముల వల్లనే కలుగుతుంది.
నిత్యానిత్య విచారణ అభ్యాసం చేస్తే వైరాగ్యం కలుగుతుంది.
ఏది నిత్యము? ఏది అనిత్యము ? తెలియాలంటే ?
GO TO THE BOTTOM OF THE CAUSE.
Also read:భగవద్గీత