ఆంధ్రుడు దగాపడిన తమ్ముడు
బడ్జెట్ వెలుతురు పడని చంద్రుడు
దారి అంతా ఎగుడు దిగుడూ
ఋణమే దారుణం
రాజకీయమే కారణం
నిత్యం తగాదాల ముఠాలు
అభివృద్దికి చెప్తారు టాటాలు !
శ్రీరాములు త్యాగాల బాటలో నడిచి
కోటలు నిర్మించుకున్న నాయకులు ఎందరో!
ఒకడు అమ్మ ఒడి అంటాడు
వేరొకడు పేదలకు రాబడి అంటాడు
మరొకడు బండి పై నిలబడి వెండి తెర భవనం
చూపిస్తాడు
ఆత్మ స్తుతి, పరనింద
ప్రతి నాయకుడూ ఒక రాజకీయ గురువింద
భవిష్యత్ గోవిందా గోవిందా
ఓటరూ
ఇదే తరుణం
కావాలి నీ బ్యాలెట్
మార్పు తెచ్ఛే డైనమైట్!
-వీరేశ్వర రావు మూల ©
Also read: ఫిర్ మిలేంగే
Also read: భ్రమరావతి