Thursday, November 21, 2024

వందేభారత్ కు ప్రయాణీకుల వందనం!

వోలేటి దివాకర్

భారతీయ రైల్వే ప్రవేశ పెట్టిన అత్యంత ప్రతిష్టాత్మక రైలు – వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కు అనూహ్య స్పందన లభిస్తోంది. రానున్న రోజుల్లో ఈ రైలు కోస్తాంధ్ర లోని విమాన సర్వీసులకు కూడా పోటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రైలును 15   జనవరి  2023 న సికింద్రాబాద్ – విశాఖపట్నం మధ్య ప్రవేశపెట్టారు .ఈ నెల వ్యవధిలో రైలు వినియోగదారుల నుండి భారీ  ఎత్తున్న ఉత్సాహభరితమైన  స్పందన లభిస్తోంది. ఈ రైలు వరంగల్, ఖమ్మం, విజయవాడ,రాజమండ్రి  స్టేషన్లలో ఆగుతుంది. ఈ   స్టేషన్లలో కూడా ఈ రైలుకు ఆదరణ చాలా బాగుంది.

VSKP SC Vande Bharat Express | Rajahmundry Godavari bridge | Indian  Railways - YouTube
గోదావరి బ్రిడ్జిపైన వెడుతున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్

 కోస్తాంధ్ర లో రాజమండ్రి ఒక  ముఖ్యమైన నగరం. పగటిపూట ఈ ప్రీమియర్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రవేశపెట్టడం వల్ల ఈ ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉంది. గత నెల వ్యవధిలో రాజమండ్రి నుంచి విజయవాడ, ఖమ్మం, వరంగల్, సికింద్రాబాద్‌లకు 4011 మంది ప్రయాణికులు ప్రయాణించగా, మరో 1505 మంది విశాఖపట్నం వైపు ప్రయాణించారు. మరోవైపు విశాఖపట్నం నుంచి రాజమండ్రికి 3152 మంది రాగా , సికింద్రాబాద్ వైపు నుంచి రాజమండ్రికి మరో 9,333 మంది ప్రయాణికులు రానున్నారు. మరో మాటలో చెప్పాలంటే, రాజమండ్రి స్టేషన్ నుండి ప్రతిరోజూ సగటున 190 మంది వ్యక్తులు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఎక్కారు, మరో 431 మంది ప్రయాణికులు రాజమండ్రి స్టేషన్‌లో ప్రతిరోజూ రైలు దిగారు. ఇరువైపులా పూర్తి సామర్థ్యంతో నడుస్తోంది.  16 జనవరి 2023 నుండి, రైలు సర్వీసును ప్రవేశపెట్టినప్పటి నుండి రైలు రెండు దిశలలో దాదాపు 140% సగటు ఆక్యుపెన్సీ (ప్రయాణికుల సీటింగ్ సామర్థ్యం)తో నడుస్తోంది.

Vande Bharat Express - Wikiwand
వెనక్కు వాలడానికి వీలుగా రిక్లయినింగ్ సదుపాయం ఉన్న కుర్చీలు

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ విశిష్టతలు  

• ప్రయాణాన్ని మరింత   సౌకర్యవంతంగా చేయడానికి ఆధునిక సౌకర్యాలను సమకూర్చారు.

•జి పి ఎస్ ఆధారిత ప్రయాణికుల సమాచార వ్యవస్థతో (ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్)  ప్రారంభించబడింది, ఆటోమేటిక్ స్లైడింగ్ డోర్‌లను కలిగి ఉంది.

• ప్రతి కోచ్‌లో రిక్లైనర్ సీట్లు. ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లో సీట్లు  (180 డిగ్రీలో)  తిరిగే అదనపు సౌకర్యం

• ప్రతి కోచ్‌లో ఎమర్జెన్సీ అలారం బటన్ మరియు ఎమర్జెన్సీ టాక్ బ్యాక్ యూనిట్‌లు.

• సౌకర్యవంతమైన, సురక్షితమైన ప్రయాణం కోసం అన్ని కోచ్‌లలో సి సి టి వి  కెమెరాలను అమర్చారు. అదనంగా, కోచ్‌ల వెలుపల ప్లాట్‌ఫారమ్ వైపు  కూడా కెమెరాలు  ఏర్పాటు చేసారు .

• అన్ని కోచ్‌ల మధ్య   రాకపోకలకు సులభతరంగా ఉండేందుకు మూసివేసిన గ్యాంగ్‌వేలతో ఏర్పాటు

• అన్ని ఎలక్ట్రికల్ క్యూబికల్స్, టాయిలెట్లలో మెరుగైన అగ్ని మాపక భద్రత ప్రమాణాలు.

• టచ్ ఫ్రీ సౌకర్యాలతో ఆధునిక బయో-వాక్యూమ్ టాయిలెట్లు.

• ప్రయాణీకుల సమాచారం, ఇన్ఫోటైన్‌మెంట్‌ను వ్యాప్తి చేయడానికి ప్రతి కోచ్‌లో పెద్ద సైజు (32″) డిస్‌ప్లే యూనిట్‌లు.

• ప్రతి కోచ్‌లో నాలుగు అత్యవసర విండోలు అమర్చబడి ఉంటాయి.

• ఆటోమేటిక్ రైలు రక్షణ వ్యవస్థ. “కవచ్” యొక్క అధునాతన భద్రత  అమర్చబడింది.

Design of Vande Bharat trains better than aeroplane: Railway Minister  Ashwini Vaishnaw
రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వందేభారత్ ప్రారంభం సందర్భంగా అభివాదం చేస్తున్న దృశ్యం

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రయోజనాలు

• వేగవంతమైన, సురక్షితమైన, సౌకర్యవంతమైన, అనుకూలమైన పగటి పూట   ప్రయాణ సౌకర్యం.

• మొట్టమొదటిసారిగా ఆకర్షవంతంగా రూపొందించబడిన పూర్తి ఏ సి సర్వీస్

• రైలు వినియోగదారులకు మెరుగైన అనుభూతితో కూడిన ప్రయాణ సౌకర్యం.

• ఇతర రవాణా మార్గాలతో ప్రయాణ సమయాన్నిపోల్చితే ఇది అతి తక్కువ ప్రయాణ సమయం.

Also read: నేటి నుంచి దూసుకుపోనున్న రైళ్లు…గరిష్ట వేగం గంటకు 130 కిలోమీటర్లు!

Voleti Diwakar
Voleti Diwakar
వోలేటి దివాకర్ ఆంధ్రభూమి దినపత్రికలో రాజమహేంద్రవరం కేంద్రంలో రెండు దశాబ్దాలకు పైగా పని చేశారు. అంతకు ముందు స్థానిక దినపత్రికలో పని చేశారు. గోదావరి పుష్కరాలు సహా అనేక రాజకీయ, సాంస్కృతిక, సామాజిక ఘట్టాలపై వార్తారచన చేశారు. ప్రస్తుతం ఆన్ లైన్ పత్రికలకు వార్తలూ, వ్యాఖ్యలూ రాస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles