ఒడ్డుకు ఒడ్డుకు మధ్య
నది ప్రవహిస్తూనే ఉంది
జలమే జీవితాధారం
అదే అద్దరికి ఇద్దరికి మధ్య
అంతంలేని అంతరం.
నవ్వులు పువ్వులై పూచే వేళ
విధి క్రీడ మొదలవుతుంది.
నవ్వులు అశ్రువులుగా మారిపోతాయి
అశలు ఆశయాలు విరిసే వేళ
గాలివానలో దీపాల్లా అల్లల్లాడే మనసులు
రోడ్డు రోలరు క్రింద అతుక్కు పోతాయి.
నవ్వులు నిశ్వాసాలై
సంతోషం ఆవిరులై
మనసులు ఖాళీయై
శూన్యం మిగిలిన వేళ
నిశ్శబ్ద ప్రేమ గీతాలు
ప్రతి నిశ్వాశంలో ఓ విరహ గీతం
ప్రతి నిమిషం ఓ విషాద రాగం
ఎవరికి తెలుసు
ఎందుకు మా నవ్వులు ఆవిరయ్యాయో
మా మనసులకు మానని గాయాలయ్యాయో
మనసులు కలిసినా మనుషులు విడిపోయామో
అరవిరిసిన కమలం అరుణ కాంతులు వెదజల్లే
సూర్యుడికి దూరంగా మిగిలి పోయిందో
వెలుగు రాకుండానే జీవితం తెల్లరిపోయిందో.
Also read: “బాల్యం”
Also read: ఓంకారం
Also read: ‘‘వరం’’
Also read: కనుమ(రుగు)