Thursday, November 21, 2024

నాకో భార్య కావాలి!

పొటో రైటప్: జూడీ బ్రాడీ

 (పురుషాధిక్యత పై వ్యంగ్యరచన)

“అందరూ అనుకునే భాషలో చెప్పాలంటే నేను ‘భార్య’ అనే తరగతికి చెందిన వ్యక్తిని, నేనో భార్యని. కాబట్టి నేనో అమ్మని” అంటూ మొదలయ్యే ఈ వ్యాసం, “దేవుడా, భార్యని ఎవరు కోరుకోరు?”అనే పదాలతో ముగుస్తుంది. ప్రముఖ అమెరికన్ స్త్రీవాద రచయిత్రి, హక్కుల కార్యకర్త జడీ బ్రాడీ ఈ ప్రసంగ వ్యాసాన్ని రాసి  50 ఏళ్ళు దాటుతోంది. నాటితో పోలిస్తే పరిస్థితి కాస్తో కూస్తో చక్కబడి ఉండవచ్చు కానీ, భార్య అనే పదానికి మన సమాజం ఇస్తున్న విలువ, గౌరవ భావనల్లో పెద్దగా మార్పు రాలేదనేదే నా భావన!

Also read: కెమేరా విజయకుమార్ కోసం…!

అలాగని ఈ చిన్న అనువాదాన్ని ముందుంచి పెద్ద పెద్ద విప్లవ పదాడంబరాలు వల్లించడం నా ఉద్దేశం కాదు. ఈ నాటికీ వ్యవస్థీకృతమై ఉన్న పురుషాధిక్యతని సమర్ధవంతంగా ఎదుర్కొని వాస్తవ స్థితిని అర్దం చేసుకోడానికి ఈ అక్షరాలు రవంత పనికొచ్చినా చాలనేదే మా అభిప్రాయం. అందుకనే ప్రత్యామ్నాయ ప్రజాతంత్ర ఉద్యమ కార్యకర్త అనురాధా గాంధీ స్మృతిలో దీనినిలా తీసుకొస్తున్నాం. ఈసరికే ఇది తెలుగులో కచ్చితంగా వచ్చే ఉండాలి కానీ ఇలాంటి యత్నాలు ఎన్ని జరిగినా తక్కువే అన్నదే మా దృక్పథం. అందుకే ఈ కరపత్రం!

Also read: అజరామర అక్షరాగ్ని శిఖరం, అఖండమైన ప్రజా కవిత్వం అలిశెట్టి ప్రభాకర్!

ఇంగ్లీష్‌లో  దీని చరిత్ర మొత్తం నెట్లో అందు బాటులో ఉంది. ఆసక్తి ఉన్న మిత్రులు చూడొచ్చు. తెలుగులో   సాఫ్ట్ కాపీ పుస్తకంగా  చదవాలనుకునే మిత్రులు కోసం పంపు తున్నాను. తప్పనిసరని కాదుగానీ ఆర్ధిక సౌలభ్యం ఉన్న మిత్రులు,  మా ప్రయత్నాలకి సహకారం అందించడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి స్పందిస్తే సంతోషం, విమర్శలకి ఆహ్వానం!

(అభ్యుదయవాదులు మొదలుకొని పెద్ద పెద్ద ఆదర్శాలు వల్లించే ఉద్యమకారుల వరకూ నిత్య జీవితంలో భాగస్వాముల శ్రమని అగౌరవ పర్చడం లోనూ, చులకన చేయడం లోనూ ఎంత నైపుణ్యాన్ని ప్రదర్శించగలరో మనకు తెలుసు కాన సమాజంలోని ఈ  జండర్ స్పృహను ఎప్పటికప్పుడు సున్నిత పర్చుకోడానికి ప్రయత్నించడం అవసరమనే భావనే ఈ కృతికి కారణం, ఎవరి దగ్గరైనా ఈ వ్యాసం తెలుగు అనువాదాలు పాతవి ఉంటే పెడితే సంతోషం.)

Also read: జీవితం మంచి కోసం వెచ్చించడమే మతం: శాస్త్రీయ, హేతువాద, సామ్యవాది వివేకానందుడు

                ‌‌‌‌             – గౌరవ్

Gourav
Gourav
గౌరవ్, సామాజిక కార్యకర్త, రామచంద్రాపురం, డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles