Sunday, December 22, 2024

శ్రీలంకపై ఒన్ డే సిరీస్ గెలిచిన భారత్, రాహుల్ 60 నాటౌట్

మూడు ఒన్  డే మ్యాచ్ ల పరంపరను ఇండియా గెలుచుకున్నది. గురువారంనాడు జరిగిన రెండవ ఒన్డే మ్యాచ్ లో కూడా శ్రీలంకను ఓడించి మూడు ఒన్ డే ల సీరీస్ ను 2- 0 స్కోర్ తో ఇండియా సొంతం చేసుకున్నది. కోల్ కతా ఈడెన్ గార్డెన్ లో జరిగిన రెండో మ్యాచ్ ను నాలుగు వికెట్ల తేడాతో ఇండియా గెలుచుకున్నది. ఓపెనర్ కెఎల్ రాహుల్ 60 పరుగులు చేసి అజేయుడుగా నిలిచాడు. భారత్ విజయానికి ప్రధాన దోహదకారి రాహుల్. ఆ తర్వాత చెరి మూడు శ్రీలంక వికెట్లు సాధించిన హైదరాబాద్ యువకుడు మొహమ్మద్ సిరాజ్, కులదీప్ యాదవ్ లు గెలుపు కారకులుగా నిలిచారు.

శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ చేయడానికి ప్రాధాన్యం ఇచ్చింది. మొదటి ఒన్ డే మ్యాచ్ లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకొని శ్రీలంక భారీగా నష్టబోయింది. బ్యాటింగ్ చేసిన ఇండియా భారీ స్కోరు చేయడంతో శ్రీలంక చివరి నిముషం వరకూ పోరాడినప్పటికీ భారత్ విజయాన్ని అడ్డుకోలేకపోయింది. ఇండియా 65 పరుగుల తేడాతో మొదటి టెస్ట్ గెలుచుకున్నది.  అది మొదటి టెస్టు సంగతి. అందుకే ఈ సారి కూడా టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాట్ చేయాలని కోరుకున్నది. కానీ 215 పరుగులకే శ్రీలంక జట్టు అంతా అవుటయింది. ఇండియా ఆట మొదలు పెట్టిన తర్వాత త్వరత్వరగా వికెట్లు కోల్పోయింది. రోహిత్ శర్మ, గిల్, కోహ్లీ, శ్రేయస్ లు పెద్ద స్కోరు చేయకుండానే పెవెలియన్ కు తిరిగి వెళ్లారు. కేఎస్ రాహుల్ కు హార్దక్ పాండ్యా మద్దతు ఇచ్చాడు. హార్దిక్ అవుటైన తర్వాత అక్షర్ పటేల్ వచ్చి కొంత నిలకడగానే ఆడాడు.  బంతి ఎత్తుకుకొట్టి క్యాచ్ ఇచ్చి అక్షర పటేల్ అవుటు కాగా కులదీప్ యాదవ్ వచ్చాడు.  నిలకడగా ఆడాడు. ఈలోగా రాహుల్ అర్ధశతకం పూర్తి చేశాడు. 60 పరుగులు చేసి అజేయంగా ఉన్నాడు. కులదీప్ విజయానికి చేర్చే పరుగు సాధించి విజయకేతనం ఎగురవేశాడు. అంతకు ముందు కులదీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్ లు చెరి మూడు వికెట్లు తీసుకొని శ్రీలంక జట్టు స్కోరును నిలువరించారు.

శ్రీలంక 215 ఆలౌట్ 39.4 ఓవర్లకు

ఇండియా 219/6 43.2 ఓవర్లకు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles